Wayanad: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేరళ రాష్ట్రం వయనాడులో (Wayanad) కొండ చేరియలు కూలి వరదలలో మరణించిన సంఘటన జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం సహాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం ,పట్టణ కార్యదర్శి ఎం డి సలీం (saleem) కోరారు. మంగళవారం సి పిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్టణంలో కేరళ వయనాడు బాధితుల (Kerala Wayanad victims)సహాయార్థం విరా ళాల సేకరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమా రు 350 మంది మరణించ డం వేలాదిమంది క్షతగాత్రులు కావడం విచారకరమని అన్నారు క్షతగాత్రులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు కృషి చేస్తున్నాయని అన్నారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం (Loss of life and loss of property) సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన మానవత్వం కలిగిన ప్రతి వ్యక్తిపై ఉందని అన్నారు నల్గొండ పట్ట ణంలో అనేకమంది మానవత్వంతో విరాళాలు అందించినా వారందరికీ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదా లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ ఉట్కూరు మధుసూదన్ రెడ్డి భూతం అరుణ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.