village employees and workers union: పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ
ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా
ప్రజా దీవెన నల్గొండ టౌన్: గ్రామపంచాయతీ కార్మికుల(Grama Panchayat workers)పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(Employees and Workers Union)రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి నల్లగొండ మండల పరిషత్ కార్యాలయం ముందు పెండింగ్ వేతనాల కోసం ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీ ఓ ముజీబ్ కు(MP O Mujeeb) కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, పన్నుల వస్సులు, డంపింగ్ యార్డ్ తదితర పనులు అనేక కష్టనష్టాలకు ఓర్చి నిర్వహిస్తున్నారని అన్నారు.
గ్రామపంచాయతీలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామపంచాయతీ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇంత పని చేస్తున్న కార్మికులకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు సుమారు 6 నుంచి పది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో అందక తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారని, కార్మికులు కుటుంబ అవసరాలకు అప్పుల మీద అప్పులు చేసి అవమానాలు పాలవుతున్నారని ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారులకు విన్నవించిన పంచాయతీలో డబ్బులు లేవని సమాధానం చెబుతున్నారు. పైగా ఇష్టమైతే పని చేయండి లేకపోతే వెళ్లిపోండి అని కార్మికులను అవహేళన చేస్తున్నారని, కార్మికులు ఇంకెంతకాలం పస్తువులతో గ్రామపంచాయతీ పనులు చేయాలని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలను విడుదల చేయాలని, కార్మికుల మెడపై గుదిబండ లాగా ఉన్న మల్టీపర్పస్ వర్కర్(Multipurpose worker) విధానాన్ని రద్దుచేసి, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ ,గుర్తింపు కార్డులు, బట్టలు, సబ్బులు, నూనెలు, చెప్పులు తదితర మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారులను కార్మికులపై కక్ష సాధింపులను ఆపాలని కోరారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)తాము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులను అర్హత కలిగిన వారందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. హామీని నిలుపుకోవాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ మండల నాయకులు వడ్డేపల్లి యాదగిరి, దున్న అనిల్ కుమార్, పెరికే కళావతి, మైసయ్య, శంకర్, పెంటయ్య, మారయ్య, సమీనా, భారతమ్మ, భాగ్యమ్మ, రమేష్, ఈశ్వర్, శ్రీశైలం, శ్రీకాంత్, మారయ్య, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
we want pending salaries