Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Welfare Hostel: సంక్షేమ హాస్టల్లో అధ్యయన యాత్రలు

–కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
–సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి.

Welfare Hostel:ప్రజా దీవెన నల్లగొండ టౌన్: జిల్లాలో విస్తృతంగా సంక్షేమ హాస్టల్స్ (Welfare Hostel) అధ్యయన యాత్రలు నిర్వహిస్తున్నట్లు వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు ఈరోజు నల్లగొండ పట్టణంలోని ఎస్సి హాస్టల్లో అధ్యయనం చేయడం జరిగింది . ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna)మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను 1500రూ. ల నుండి 2500రూ. లకు పెంచాలని విద్యార్థుల ప్యాకెట్ మనీ 1000రూ.లు ఇవ్వాలని మెనూ సక్రమంగా అమలు చేసి విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్లో మంచినీటి సౌకర్యం లేదని నల్ల నీళ్లు తాగుతున్నారని అన్నారు.

అదనపు గదులను నిర్మించాల న్నారు. స్నానాలు బట్టలు వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Govt)15 నెలలుగా భవనం అద్దె (rent) చెల్లించడం లేదన్నారు. ఐదు నెలలుగా కరెంటు బిల్లు బకాయి ఉందన్నారు విద్యార్థుల పోటీ పరీక్షల మెటీరియల్ ప్రభుత్వం అందించాలన్నారు. హాస్టల్లో ఉదయం పూట పెట్టాల్సిన టిఫిన్ ప్రతిరోజు పప్పుతో కూడిన రైస్ పెడుతున్నారని, కనీసం ఇడ్లీ వడ పూరి దోష వంటి టిఫిన్లకు విద్యార్థులు నోచుకోవట్లేదని చెప్పారు. విద్యార్థులకు పౌరసరపరాల నుండి సన్నబియమిస్తున్నామని పదేపదే చెబుతున్నారని కానీ అవి సన్నబియ్యం కాదని బియ్యం పట్టి పరిశీలించి చూశారు. కొత్త బియ్యం కావడం వలన అన్నం ముద్దగా మారిందన్నారు.

2016 సంవత్సరం నుంచి కేవలం కేవలం 1500 రూపాయలు మాత్రమే అందిస్తున్నారని అవి సరిపోవటం లేదన్నారు విద్యార్థుల లైబ్రరీలో (student library)పోటీ పరీక్షల మెటీరియల్ ఇవ్వాలన్నారు ఆట వస్తువులు అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేకపోవడంతో చదువులపై దాని ప్రభావం పడుతుందన్నారు. సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులు మూడు నెలలకోసారి తనిఖీ చేయాలని స్థానిక సమస్యలన్నీటిని పరిష్కరించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపుదలకు తక్షణమే బడ్జెట్ కేటాయించాలన్నారు. హాస్టల్ కు ప్రభుత్వ వైద్యాధికారులు నెలకోసారి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య సమస్యల్ని తెలుసుకోవాలని జీవో ఉన్నప్పటికీ అది అమలు కునోచుకోవటంలేదని డాక్టర్లు రావట్లేదని చెప్పారు. గ్రీజర్ సౌకర్యం కల్పించాలని మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించాలని చెప్పారు. హాస్టల్లో పదిమందితో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్ సర్వేలో (hostal survey)కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ బొల్లు రవీందర్ బొట్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.