Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Irrigation Lands: భూ భకాసురులపై ఉక్కుపాదం

ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ జిల్లాలోని భూ బకాసురులపై ఉక్కు పాదం మోపుతున్నారు పోలీసులు.

పోలీసులు అదుపులో ముగ్గురు తహశీల్దార్లు, వీఆర్వో
అక్రమ భూపట్టాల దందాలలో రెవెన్యూ అధికారుల అందెవేసిన చేయి
నల్లగొండ జిల్లా కేంద్రం ఇరిగేషన్ భూముల సంగతేమిటి

ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ(Nalgonda) జిల్లాలోని భూ బకాసురులపై ఉక్కు పాదం మోపుతున్నారు పోలీసులు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండదండలకు తోడు రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగు లను ఆసరా చేసుకుని కొంతమంది రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కాల్ చేసిన వైనంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మాకు ఎవరు అడ్డంటూ అడ్డగోలు గా ఎవరికి పడితే వాళ్లకు అప్పనంగా పట్టాలు పంచిపెట్టారు. లక్షలాది రూపాయలు చేతులు మారిన నేపథ్యంలో పట్టాల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా ముగించారనేది బహిరంగ రహస్యమే.

కొంతమంది రెవెన్యూ అధికారులను రెండు రోజుల క్రితం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అరెస్ట్ చేసి తమ అదుపులో అరెస్టు చేసిన రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఈ వ్యవహారంలో తహ శీల్దార్ లు మందడి నాగార్జున రెడ్డి(Mandadi Nagarjuna Reddy) గుగులోతు దేశాయ్, ఏ ఆర్ నాగరాజ్, తుమ్మడం వీఆర్వో గా ఉన్న ముదిగొండ సుమన్ ఉన్నారు. అయితే మందడి నాగార్జున రెడ్డి, దేశనాయక్, ఏ ఆర్ నాగరాజు లు గతంలో నిడమనూరు మండలంలో పనిచేసిన కాలంలో తుమ్మడం గ్రామ శివారులో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ తీర్మానం లేకుండానే కొంతమందికి పట్టాలు చేసి చేశారు. ఈ పట్టాలు చేయడంలో ముగ్గురు ఎమ్మార్వోల(MRO) హస్తము ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం హుజూర్ నగర్ లో(Huzur Nagar)పని చేస్తున్న మందడి నాగార్జున రెడ్డి తను చేసిన అక్రమ పట్టాలు తో పాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో కూడా ఇరిగేషన్ భూములను కొంతమంది జర్నలిస్టులకు సుమారు రూ.10 కోట్ల విలువైన భూమిని అక్రమంగా పట్టా చేసిన ట్లు పక్క ఆధారాలున్నాయి. ఇందుకు సంబంధించి గత ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన భూమిని రెవెన్యూ అధికారి అక్రమ రిజిస్ట్రేషన్(Registration) చేశారని సంబంధిత ఇరిగేషన్ అధికారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అయి నా పట్టా చేసిన వారికి చేయించు కున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమా నాలకు తావిస్తుంది.

నకిలీ ఇంటి నెంబర్లు, ఇంటి పన్ను రసీదులు కూడా ఆ జర్నలిస్టులు సృష్టిం చారని మున్సిపల్ అధికారులు కూడా ధృవీకరించారని, ఆదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారులకు కూడా నివేదిక అందజేశారని తెలిసింది. అయినా వాళ్లపై ఏ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు తారస్థాయికి చేరాయి. ఇలా ఉంటే నిడమనూరులో అక్రమ పట్టా చేయించుకున్న కొంతమంది రైతులను పోలీసులు(Polices) అరెస్ట్ చేశారు కానీ నల్లగొండ జిల్లా కేంద్రంలో జర్న లిస్టులను మాత్రం అరెస్టు ఎందుకు చేయరని చర్చ పెద్ద ఎత్తున సాగు తుంది. జర్నలిస్టుల వెనుక ప్రభు త్వంలో ఉన్న కొంత మంది పెద్దల హస్తం కూడా ఉండొచ్చని ప్రచారం విస్తృతంగా క్షేత్రస్థాయికి పాకింది.

మర్రిగూడ(Marriguda)మండలంలో తహశీల్దార్ గా పనిచేసిన దేశ్య నాయక్ క్షుదా భిక్ష పల్లిలో 31 నుంచి 48 సర్వే నెంబర్ వరకు నిషేధిత భూముల ను అక్రమంగా కొంతమందికి పట్టాలు చేసినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. దాదాపు నాలు గు వేలకు పైగా ఎకరాలు రిజిస్ట్రేష న్ చేసి లక్షల రూపాయలు ఆర్జించా రని సమాచారం. అంతేకాకుండా కట్టంగూర్ లో(Kattangur)పనిచేసిన సమ యంలో దుగినెల్లి గ్రామంలో ప్రజలు నివసిస్తున్న స్థలాన్ని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ చేశారని అప్పట్లో గ్రామస్తులు రెవెన్యూ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. వీళ్లంతా పనిచేసిన ప్రతిచోట భూములకు సంబంధించి అక్రమాలు కోకొల్ల లుగా ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

What about Irrigation Lands in Nalgonda