Women Teacher’s Day: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నాగార్జున ప్రభుత్వ కళాశాలలో యన్ యస్ యస్ యునిట్స్ అధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలలో భాగంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగినది. ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రీ బాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి194వ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే సమాన విద్య కోసం, మహిళా సాధికారత కోసం పరితపించిన మహిళా చైతన్య దీప్తి అని అన్నారు.
భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సేవలు అందించడమే కాకుండా అట్టడుగు వర్గాలలో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన త్యాగశీలి అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్ధ శాస్త్ర ఉపన్యాసకులు డా. ముని స్వామి, యన్ సి సి కేర్ టేకర్ సుధాకర్, యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , యమ్ వెంకట రెడ్డి, యన్ కోటయ్య, బి.అనిల్ కుమార్, కె శివరాణి, ఏ.మల్లేశం, యమ్ సావిత్రి బోధన, బోధనేతర సిబ్బంది యన్ యస్ యస్ వాలంటీర్స్ , విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.