ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: యోగా ద్వారా దీర్ఘకాలిక రోగాల నుంచి దూరం కావచ్చని సీనియర్ యోగా శిక్షకులు కంది భజరంగ్ ప్రసాద్ అన్నారు. చిట్యాల ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం సందర్భం గా చిట్యాల ఆయుష్ హోమియో ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థు లకు యోగ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ధ్యానం ప్రాముఖ్యతను వివరించా రు.
అనంతరం విద్యార్థులచే ధ్యా నం చేయించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయుడు సత్తయ్య మాట్లా డుతూ విద్యార్థులు నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యము ఆనం దంగా ఉండవచ్చని చదువు పట్ల ధ్యాస నిలిపేందుకు ధ్యానాన్ని సాధన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు భజరంగ్ ప్రసాద్ వైష్ణవిలు ప్రద ర్శించిన క్లిష్టమైన యోగ ఆసనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు