Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

YSR Jayanthi: ఘనంగా వైయస్సార్ జయంతి

YSR Jayanthi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)75 వ జయంతిని పురస్కరించుకొని సందర్బంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Nalgonda Municipal Chairman Burri Srinivas Reddy), వైస్ చైర్మన్ అబ్బగొ ని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, డీసీబీసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు (Congress leaders)మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.