Kishan reddy: విద్యుత్ కోతలు లేని దేశం మోదీ ఘనతే
బొగ్గు, గను ల శాఖ మంత్రిగా దేశ ప్రజల ఆకాం క్షల మేరకు, మోడీ సంకల్ప్ పత్రం లో పేర్కొన్నట్టుగా ఈ ఐదేండ్లు పూర్తి స్థాయిలో తనకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరుస్తా నని తెలిపారు.
బొగ్గు కొరత లేకుండా చూడటమే కారణం నిదర్శనం
బొగ్గు గనుల శాఖ మంత్రిగా బా ధ్యతలు స్వీకరించిన సందర్భంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బొగ్గు, గను ల శాఖ మంత్రిగా(Minister of Coal and Mines) దేశ ప్రజల ఆకాం క్షల మేరకు, మోడీ సంకల్ప్ పత్రం లో పేర్కొన్నట్టుగా ఈ ఐదేండ్లు పూర్తి స్థాయిలో తనకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరుస్తా నని తెలిపారు. శక్తివంతమైన భార త్ ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్ శాఖల పాత్ర కీలకం అన్నా రు. దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ శాఖల్లో చాలా సీనియర్, ఉత్తమ అధికా రులు ఉన్నారన్నారు. వారందరితో కలిసి టీమ్ వర్క్ తో పనిచేసి భార త్ ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచే స్తానని తెలిపారు.
కిషన్ రెడ్డి (Kishan reddy)బాధ్య తలు ఇచ్చిన శాఖను సమర్ధవం తంగా నిర్వహిస్తానన్న మంత్రి అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో ప్రధాని మోడీ (Prime minister)విద్యుత్ కొరతకు చెక్ పెట్టారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా న్యూఢిల్లీలో ఆయన ఇవాళ బాధ్యతలు స్వీక రించారు. అనంతరం మాట్లాడు తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తనకు రెండు శాఖల బాధ్యతలు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఇవాళ బొగ్గు, మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని తెలి పారు. ఇప్పటి వరకు ప్రహ్లాద్ జోషి, అంతకు ముందు పీయూష్ గోయల్ ప్రధాని మోడీ ఆశీర్వాదంతో ఈ శాఖలో పనిచేశారన్నారు. ప్రజల జీవితాల్లో విద్యుత్ రంగం కీలకంగా ఉన్నదన్నారు.పదేండ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేదన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలు సమ్మె చేసిన ఘటనలు మనం చూశామన్నారు. కరెంట్, నీళ్ల కొరత ఉండేది. పంటలు ఎండిపోయేవి.
అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో మోదీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారన్నారు. ఆయన నాయ కత్వంలో గత పదేండ్ల నుంచి వ్యవ సాయానికి, పరిశ్రమలకు, గృహాల కు సరిపోను కరేంట్ వస్తున్నది. దానికి ప్రధానమైన కారణం బొగ్గు అన్నారు. థర్మల్ కేంద్రాల ద్వారానే ఈరోజు ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుం టున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేలా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామన్నారు. దేశంలో ఉన్న ఖనిజాలను బయటకు తీయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్ ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామ న్నారు.
దేశ ప్రజల ఆకాంక్షల మేరకు, మోడీ సంకల్ప్ పత్రంలో(Modi Sankalp document) పేర్కొన్నట్టుగా ఈ ఐదేండ్లు పూర్తి స్థాయిలో తనకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరు స్తానని తెలిపారు. శక్తివంతమైన భారత్ ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్ శాఖల పాత్ర కీలకం అన్నారు. దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ శాఖల్లో చాలా సీనియర్, ఉత్తమ అధికారులు ఉన్నారన్నారు. వారందరితో కలిసి టీమ్ వర్క్ తో పనిచేసి భారత్ ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.
24 Hours current in Modi ruling