Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Air Balloon Accident : బిగ్ బ్రేకింగ్, హాట్ ఎయిర్ బెలూన్ పైనుంచి పడి వ్యక్తి మృతి

Air Balloon Accident : ప్రజా దీవెన, రాజస్థాన్: రాజస్థాన్ లోని బారన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హాట్ ఎయిర్ బె లూన్ ను పరీక్షిస్తుండగా ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి బెలూన్ గాలి లోకి లేవడంతో దానికి కట్టి ఉన్న తాడుకు చిక్కుకుని ఓ వ్యక్తి కూడా పైకెగిరాడు. దాదాపు వంద ఫీట్ల ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగడంతో కిందపడి మరణించా డు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బారన్ జిల్లా ఫౌండేషన్ డే వేడుక లకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ దు ర్ఘటన చోటుచేసుకుంది. దీంతో మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన వేడుకలను జిల్లా యం త్రాంగం రద్దు చేసింది. హాట్ బెలూ న్ గాలిలోకి ఎగరడం, తాడుకు చి క్కుకుని ఓ వ్యక్తి దానికి వేలాడడం, పైకెగిరాక తాడు తెగడంతో ఆ వ్యక్తి కింద పడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, ప్రమాదం జరిగి న వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని చెప్పారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ని కోటాకు చెందిన వాసుదేవ్ ఖా త్రిగా గుర్తించినట్లు అధికారులు తె లిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పో లీసులు వివరించారు.