Ashwani Vaishnav: కేంద్ర సమాచార, ప్రసారశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరణ
కేంద్ర సమా చార, ప్రసార శాఖా మంత్రిగా అశ్వ నీ వైష్ణవ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రం ప్రజాసేవ, పేదల సంక్షేమా నికే కట్టుబడి ఉంది
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర సమా చార, ప్రసార శాఖా మంత్రిగా అశ్వ నీ వైష్ణవ్(Ashwani Vaishnav) as Broadcasting Minister)ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై ఉందని అన్నారు. నిన్న జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో(Cabinet meeting) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం పేదల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనం అన్నారు.
దేశ ప్రజలకు తమ ప్రభుత్వం నిరం తరం సేవ చేస్తూనే ఉంటుందని అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు(Ministry Secretary Sanjay Jaju)తో పాటు మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే మీడియా యూనిట్లు, ఇతర ప్రభుత్వ అధికారులు మంత్రి వైష్ణవ్(Minister Vaishnav) కు స్వాగతం పలికారు.
Ashwani Vaishnav Broadcasting Minister