Big Breaking :ప్రజా దీవెన జార్ఖండ్: జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య బీకరఎ దురుకాల్పులు కొనసాగుతున్నట్లు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
సోమవారం తెల్లవారుజామున బొ కారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాం తంలో మావోయిస్టులు ఉన్నరన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెం దిన 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు, స్థానిక పోలీసులు సం యుక్తంగా కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో లుగు కొండల ప్రాంతంలో భద్రతా బలగా లకు మావోయిస్టులు ఎదురుపడ్డా రు. దీంతో ఇరు పక్షాల మధ్య కా ల్పులు జరిగాయి. పోలీసుల కా ల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని సీఆర్‌పీఎఫ్ అధికా రులు వెల్లడించారు. మృతులను గుర్తించాల్సి ఉందని తెలిపారు.
ఘటనా స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్, ఇ న్సాస్ రైఫిళ్లతోపాటు భారీగా ఆ యుధాలు స్వాధీనం చేసుకున్నా మని చెప్పారు. ఆ ప్రాంతంలో కా ల్పులు ఇంకా కొనసాగుతున్నా యని వెల్లడించారు.