Apache AH-64E Helicopter: బిగ్ బ్రేకింగ్, భారత వైమానిక అ మ్ములపొదిలో అత్యాధునిక ఆపాచీ హెలికాప్టర్లు
Apache AH-64E Helicopter : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత వై మానిక అమ్ములపొదిలోకి అమెరి కాకు చెందిన అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు చేరాయి. తొలి విడతగా మూడు హెలికాప్టర్లు అమెరికాలోని హిండన్ విమానాశ్రయంలో వాటిని భారత వైమానిక అధికారులకు అప్పగించా రు. రకరకాల కారణాలతో ఈ మూ డు హెలికాప్టర్ల అప్పగింత 15 నెల లు ఆలస్యం కాగా ఆరు అపాచీ కొ నుగోలుకు 2020లో అమెరికాతో భారత్ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
ఈ ఒప్పందం విలువ 600 మిలియ న్ డాలర్లు భారత్ రూపాయి విలువ తో పోలిస్తే రూ.5,171 కోట్లు కాగా 2024 జూన్ నెలలో మొదటి దశ హెలికాప్టర్లను అప్పగించాల్సి ఉం డగా కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. మొదటి దశ హె లికాప్టర్లు మంగళవారం అందజేయ గా, రెండో దశ హెలికాప్టర్లు (apac he ah-64e helicopter) ఈ ఏడా ది ఆఖరు నాటికి రాబోతున్నట్లు స మాచారం.
*భారత వైమానిక దళంలో కీల కం…* అపాచీ ఏ హెచ్-64ఈ హె లికాప్టర్లు భారత వైమానిక(Indian AIR Force) దళంలో కీలకం కాబో తున్న ఇవి శక్తివంతమైనవిగా ప్రా చుర్యం పొందాయి. పాకిస్తాన్ సరి హద్దుల్లో వీటిని మోహరిం చబోతు న్నారు. కాగా, 2015లో కు దిరిన మరో ఒప్పందం కింద భారత సై న్యం ఇప్పటికే 22 సాధారణ అ పాచీ హెలికాప్టర్లను సమకూర్చు కుంది. తాజాగా అత్యాధునికరించి న ఏ హెచ్-64ఈ అటాక్ హెలికాప్ట ర్లు భారత వైమానిక దళంలో చేర డం అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది.