Big Breaking : ప్రజా దీవెన, మధ్యప్రదేశ్: దసరా పండుగ ఆ కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. మధ్యప్రదేశ్ రా ష్ట్రంలో జరిగిన ఘోర దుర్ఘటనలో పది మంది జలసమాధి అయ్యారు.
మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో మధ్యాహ్నం దుర్గామాత విగ్రాహాన్ని నిమజ్జన కార్యక్రమం వారి జీవితా లను ఒక్కసారిగా చిదిమేసింది. దు ర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేయాలని ముందుకు క దిలిన వారి పట్ల విధి వక్రీకరించి క ళ్ళ ముందే జలసమాధి కావడం తీ వ్ర విషాదాన్ని నింపింది. దుర్గామా తను నిమజ్జనం చేసేందుకు బయ లుదేరిన ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో పది మంది భక్తులు మృత్యువాత పడ్డారు.
సదరు దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలోని పంధానాలోని అర్దాలా గ్రామంలో ప్రతి ఏటా విజ యదశమి ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే మొత్తానికి నవరాత్రులు పూజలందుకున్న అ మ్మవారిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్‌పై యాత్ర ముందుకు కదిలిం ది. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా విగ్ర హాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్ అదుపుత ప్పి చెరువులో పడిపోయింది. దీం తో ట్రాక్టర్లో ఉన్న దుర్గమ్మ భక్తులు నీటిలో మునిగిపోయారు.
బాధితులు కేకలు వేయడంతో ప్ర మాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే జేసీబీల సహాయంతో వా రిని రక్షించేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్‌తో పాటు 11 మందిని బయ టకు తీయగా మరో 10 మంది నీట మునిగి చనిపోయినట్టు స్థానిక అ ధికారులు వెల్లడించారు. ప్రజలు అందించిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలా నికి చేరుకొని మృతదేహాలను స్వా ధీనం చేసుకొని విచారణ ప్రారం భించారు. గల్లంతైన మరికొందరి కో సం నదిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగించారు.
ఘటనపై స్థానిక పోలీసులు మాట్లా డుతూ ప్రమాద సమయంలో ట్రా క్టర్‌లో 20-25 మంది భక్తులు ఉన్న ట్టు, వారిలో 11 మందిని రక్షించిగా మరో 10 మంది మరణించారని మి గతావారి ఆచూకీకోసం గాలింపు చ ర్యలు చేపట్టిన్నట్టు తెలిపారు. అ యితే మృతుల్లో ఎక్కువశాతం యువకులే ఉండడం గమనార్హం.
నిమజ్జనంలో అపశృతి ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాల కు ప్రగాఢ సానుభూతి తెలియజే శారు. మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రూ. 4 లక్షలు ఆర్థిక సా యం ప్రకటించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.