tragic road accident : ప్రజా దీవెన మధ్యప్రదేశ్: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజా మున ఘో ర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులు ఒకే కుటుంబానికి చెం దిన వారు కాగా, వీరంతా వివాహాని కి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.మేఘ్‌నగర్ త హసీల్ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో ఓవర్- బ్రిడ్జ్‌ని సిమెంట్ లోడ్‌తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్ ఉన్న వ్యాన్‌పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్ పద్మవిలోచన్ శు క్లా తెలిపారు.
ఈ ప్రమాదంలో 9మంది మృతి చెం దగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ము గ్గురు మహిళలు, ఇద్దరు పురుషు లు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవ ర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు.