Jio and Airtel users: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ షాక్
దేశంలో జియో, ఎయిర్ టెల్ సంస్థలకు సంబంధించిన లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం.
లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్ రంగం సిద్ధం
మోసాలు అరికట్టేందుకు కేంద్రం చర్యలు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో జియో(JIO), ఎయిర్ టెల్( Airtel) సంస్థలకు సంబంధించిన లక్షల్లో సిమ్ కార్డులు(SIM cards) బ్లాక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. ఆన్‌లైన్ మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మొబైల్ బ్యాండ్‌లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18 లక్షల మొబైల్ కనెక్షన్లు(Mobile connections), సిమ్ కార్డులు మూసివేయ బడతాయి. తద్వారా తప్పుడు కార్యకలాపాలకు సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Big shock for Jio and Airtel users