Revanth reddy campaign: బిజెపి కి భంగపాటు తప్పదు
బీజేపీ పదేళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబె ట్టిందని ప్రజలు ఆ పార్టీకి ఓటు వేసి 400 పార్లమెంటు స్థానాలు కట్ట బెడుతారని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశంలో ఏమి ఒరగబెట్టారని 400 సీట్లు ఇవ్వాలి
ఆ స్ధాయిలో గెలుస్తామనుకోవడం ఉట్టి భ్రమే
దక్షిణాదిలోని 130 స్థానాల్లో ఆ పార్టీకి పదిపదిహేను దాటవు
ప్రజల్లో గందరగోళం సృష్టించేం దుకే బిజెపి ప్రచారం
కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, కేరళ: బీజేపీ పదేళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబె ట్టిందని ప్రజలు ఆ పార్టీకి ఓటు వేసి 400 పార్లమెంటు స్థానాలు కట్ట బెడుతారని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తు వుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని, నిరుద్యోగం గరిష్ఠ స్థాయుకి చేరిందని, రైతుల సమస్యలు పెరిగిపోయాయని, ముఖ్యంగా గత పదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని రూ.130 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని అందుకే బిజెపి కి ప్రజలు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రా ల్లోని 130 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి మా అంటే 12 నుంచి 15 స్థానాలు మాత్రమే వస్తాయని జో స్యం పెంచారు.
మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకోబోతున్నాయని పేర్కొన్నా రు. దేశానికి సంబంధించి ఇవి అత్యంత కీలక మైన అంశాలని, ప్రజలు వీటిన్నిoటిని పరిగణనలోకి తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో (Kerala) స్టార్ క్యాంపె యినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రేవంత్‌రెడ్డి గురు వారం మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే 400 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయమని అన్నారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన(Assembly Elections) అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీర్ సైతం ఇలాంటి ప్రచార మే చేశారని, మూడోసారి 100కు పైగా స్థానాలను గెలుస్తామని చెప్పు కొన్నారు కానీ అతి కష్టమ్మీద 39 స్థానాల్లోనే గెలవగలిగారని గుర్తు చేశారు. ప్రధాని మోదీని గతంలో పొగిడారన్న ప్రశ్నకు రేవంత్ స్పంది స్తూ ఒక ముఖ్యమంత్రిగా దేశ ప్రధా నితో మాట్లాడానే తప్ప పొగడలే దని అన్నారు. ప్రధానికి సంబంధిం చి తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. కేరళలో ని మొత్తం 20 ఎంపీ స్థానాలను ఇండియా కూటమి గెలుచుకోబో తోందని, బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
BJP defeat in Parliament elections