Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy: ప్రజల గుండె చప్పుడుగా ‘బిజెపి ‘

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి అన్నారు.

ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాదే ఇక్క‌డ అధికారం
కాంగ్రెస్ తొండాడటంతోనే మరికొ న్ని సీట్లు త‌గ్గాయి
మొత్తం స్థానాల్లో కెల్లా 13 స్థానా ల్లో బీఆర్ఎస్ ఉనికే లేదు
కాంగ్రెస్ పార్టీ కి గ‌తం కంటే ఓట్లు త‌గ్గాయి
డిల్లీ మీడియా స‌మావేశంలో సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్ రెడ్డి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి(MP Kishan Reddy)అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు తెలంగా ణలో బీజేపీ ఎదుగుదలకు ఆరం భం మాత్రమే అన్నారు. ఈ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ తమ ఉనికిని కోల్పో యిందన్నారు. బీఆర్ఎస్ 14చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని తెలిపారు. 8చోట్ల డిపాజిట్లు కోల్పో యిందన్నారు. ఖమ్మం, మహబూ బాబాద్ తప్ప మిగిలిన చోట్ల మూ డో, నాలుగో స్థానానికి పడిపోయిం దని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections)కాంగ్రెస్ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి ఓట్లు తగ్గాయన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుందన్నారు. విద్యా వంతులు, కవులు, ఉద్యమకారుల ఆకాంక్ష కూడా ఇదే అన్నారు. పార్ల మెంటు ఎన్నికల్లో(Parliamentary elections)మేం 8 చోట్ల గెలి చామన్నారు. మరో 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాంగా నిలిచా మన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌ నగర్‌ లో మా పార్టీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna)గెలిచారన్నారు.సామ, భేద, దాన, దండోపాయాలు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రయో గించినా మా అభ్యర్థిపై అసభ్య పదజాలాలు ప్రయోగించినా బీజేపీ కార్యకర్తలను బెదిరించినా ప్రజలు బీజేపీకే పట్టం గట్టారని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిలో మా ఈటెల రాజేందర్ దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తొండి అట ఆడిందని, బీజేపీపై(BJP) తప్పుడు ప్రచా రాలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ సికింద్రాబాద్ లో పోటీ చేసిందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నా రు. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.

BJP Voting percentage increased in Telangana