PM Modi: మూడో దఫా పాలనలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తాం
అధికారం లో ఏ పార్టీ ఉన్నదన్న దాంతో సంబంధం లేకుండా దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు.
ఏ పార్టీ అనేది కాకుండా రాష్ట్రాల తో కలిసి పని చేస్తాం
భారత రాజ్యాంగమే మనకు దిశా నిర్దేశం
పార్టీలకతీతంగా దేశాభివృద్ధికి కృషి చేస్తాం
ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణులతో ప్రధాని మోదీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అధికారం లో ఏ పార్టీ ఉన్నదన్న దాంతో సంబంధం లేకుండా దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని ప్రధాని మోదీ(Prime Minister Modi) చెప్పారు. తమ మూడో దఫా పాలనలో అవి నీతిని కూకటివేళ్లతో పెకిలించటం పై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
మంగళవారం లోక్‌సభ ఎన్నిక ల ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీ కేంద్రకార్యాలయంలో పార్టీ శ్రేణు లను ఉద్దేశించి మోదీ ప్రసంగించా రు. జై జగన్నాథ్ అంటూ ప్రసం గాన్ని ప్రారంభించి, ఒడిశాలో తొలి సారిగా బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని ఎన్ను కున్నందుకు ఆ రాష్ట్ర ప్రజ లకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రంలో ఎన్‌డీఏపై ప్రజలు వరుసగా మూడో సారి నమ్మకం ఉంచా రని, ఇది విక సిత్ భారత్‌కు లభించిన విజయ మని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి సార థ్యంలో వరుసగా మూడు పర్యా యాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారని మోదీ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను వెల్ల డిస్తూ దేశ రాజ్యాం గమే మాకు దిశానిర్దేశం చేస్తుంది.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచ టానికి అన్ని రాష్ట్రాల తో కలిసి పని చేస్తాం. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఈ కృషి కొనసాగిస్తామని, మరిన్ని భారీ నిర్ణయాలు కూడా ఉంటాయని మోదీ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, రక్షణ, తయారీ రంగాల్లో శీఘ్ర అభి వృద్ధికి చర్యలు తీసుకుంటా మని, రైతులు స్వయంసమృద్ధి సాధిం చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
గ్రీన్ ఇండస్ట్రియలైౖజే షన్‌లో (Green Industrialization) పెట్టుబడులను పెంచుతా మన్నా రు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు పనిచేస్తామన్నారు. ప్రపంచస వాళ్లను పరిష్కరించ డానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
తగ్గిన మెజార్టీని ప్రస్తావించని మోదీ… ఎన్నికల్లో బీజేపీకి(BJP) సీ ట్లు తగ్గి సొంత మెజారిటీ లభించని విషయాన్ని మోదీ తన ప్రసంగం లో ప్రస్తావించలేదు. అయితే మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒ డిశా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్‌లలో పార్టీకి లభించిన విజ యాల్ని ప్రస్తుతించారు.
ఒడిశాలో తొలిసారిగా బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోందని, కేరళలో ఖాతా తెరిచిందని, తెలంగాణలో గతంలో కన్నా రెట్టిం పు సీట్లు సాధిం చిందని గుర్తు చేశారు.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు,(Chandrababu)బిహార్‌లో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అధ్వ ర్యంలో ఎన్‌డీఏ(NDA) కూట మి అద్భుత ఫలితా లను సాధించిందన్నారు. దశాబ్దం కాలంగా చే స్తున్న మంచి పనులను కొనసాగిస్తామని, ప్రజల కలలను సాకారం చేయడానికి కృషి చేస్తామన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు కృత జ్ఞతలు తెలిపారు.
BJP work with All states