Black box CCTV camera: రైల్వే శాఖ కీలక నిర్ణయo ఏమిటో తెలుసా
దేశంలో రైలు ప్రమాదాల నివారణకు భారతీ య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసు కుంది. ప్రమాదాలను నివారించడం తో పాటు ప్రమాదాలకు గల కారణా లను విశ్లేషించే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించే సరికొత్త ఆలోచనకు శ్రీకారం
రైళ్లలో క్రూ వాయిస్ వీడియో రికా ర్డింగ్ సిస్టమ్ ఏర్పాటుకు ప్లానింగ్
తద్వారా ప్రమాదాలు తగ్గడం, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా చర్యలు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో రైలు ప్రమాదాల(train accidents) నివారణకు భారతీ య రైల్వే శాఖ( Railways Department) కీలక నిర్ణయం తీసు కుంది. ప్రమాదాలను నివారించడం తో పాటు ప్రమాదాలకు గల కారణా లను విశ్లేషించే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మా దిరిగా రైల్ లోనూ బ్లాక్ బాక్స్ ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. ఒక వేళ ప్రమాదం జరిగితే అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి, ప్రమా దం జరిగినప్పుడు అసలేం జరిగిం ది, అనే ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు రైళ్లలో క్రూ వా యిస్ వీడియో రికార్డింగ్ సిస్టమ్ (సీవీవీఆర్ఎస్) ను ఏర్పాటు చేయ నున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటిం చింది. త్వరలోనే రైల్ ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్ లను ఏర్పాటు చేస్తామ ని రైల్వే శాఖ అధికారులు తెలిపా రు.
బ్లాక్ బాక్స్ ను రైళ్లలో పెడితే ఉపయోగం ఏంటి .. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలల క్రితం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావ త్ దేశాన్ని కుదిపేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలను దృష్టిలో ఉంచు కుని కేంద్ర రైల్వే శాఖ రైళ్లలో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిం ది. అయితే రైల్ ఇంజిన్‌లో బ్లాక్ బాక్స్ అమర్చడం వలన ప్రమాదా నికి ముందు జరిగే పొరపాట్లు, రైలు ప్రయాణించే మార్గానికి సంబంధిం చిన లోపాలపై ఎప్పటికప్పుడు లో కో పైలట్ ను అలర్ట్ చేస్తుంది. తద్వారా ప్రమాదాలు తగ్గడం, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా ఉంటుందని, అయితే బ్లాక్ బాక్స్ అమర్చే అంశంపై ప్రస్తుతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైల్వే అధికారులు.
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి… విమానాల్లో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ గురించే చర్చ జరుగుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ద్వారా అసలేం జరిగిందో తెలిసిపోతుంది. అందుకే ఈ విధానాన్ని రైళ్లలో కూడా ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. అయితే విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్ ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. ఈ బ్లాక్ బాక్స్ లోకో పైలట్‌ల మాటలు, రైలు కార్యక లాపాల వీడియో, ఆడియో రికార్డ్ చేస్తుంది. రైలు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. వేగం, బ్రేక్స్, ఇంజిన్ స్థితి సహా కీలక అంశాలను అబ్జర్వ్ చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ బాక్స్ లను రైళ్లలో ఏర్పాటు చేస్తే ప్రమా దాలు దాదాపుగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
సీసీ కెమెరాలు కూడా..
బ్లాక్ బాక్స్‌తో పాటు(Black box CCTV camera) రైళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయ నున్నట్లు రైల్వే అధికారులు తెలి పారు. ప్రతి రైల్ ఇంజిన్ లో 4 డిజి టల్ కెమెరాలను ఏర్పాటు చేయ నున్నారు. ఈ కెమెరాల్లో రెండు కెమెరాలు ట్రైన్ లోకో పైలట్స్ కదలికలను ఫోకస్ చేస్తే మరొకటి ఇంజిన్ బయట ట్రాక్ కు ఎదురుగా ఉండి, ట్రాక్ ను ఫోకస్ చేస్తుంది. నాలుగో కెమెరాను ఇంజిన పైభా గంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నార్త్ ఈస్టర్న్ రైల్వే ఇంజిన్ లలో ఈ బ్లాక్ బాక్స్ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎనిమిది ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశామని… త్వరలోనే మరిన్ని రైల్వే ఇంజిన్లకు కూడా ఏర్పాటు చేయ డం జరుగుతుందన్నారు.
Black box CCTV cameras installed in trains