Budget 2025 : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభు త్వం పన్ను చెల్లింపు దారులకు తీపికబురు అందించింది. సామా న్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 రానే వస్తూ దేశంలోని కోట్లాదిమంది పన్ను చెల్లింపు ధారులకు పోరాట కల్పించింది. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూ డవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఈ రోజు పార్లమెంటులో సమర్పించారు.
పార్లమెంట్‌లో బడ్జెట్ సమా వేశాలు కొనసాగుతున్నాయి. మం త్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపిస్తున్నారు. ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం బడ్జెట్‌లో శుభ వార్త అందించారు మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదా రులకు అదిరిపోయే శుభవార్త అందించారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లిం పులు ఉండబోవని మంత్రి నిర్మలా సీతారా మన్ ప్రకటించారు.
నిర్మలమ్మకు మిఠాయి తినిపిం చిన రాష్ట్రపతి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో 2025 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రప తి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై బడ్జెట్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. పెరుగు, చెక్కరతో నోరు తీపి చేసి గుడ్‌లక్ చెప్పారు.
ఇన్‌కం ట్యాక్స్‌పై కేంద్రం గుడ్‌న్యూస్..ఆదాయపు పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరికెంత అనేది చూద్దాం.
రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు
రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.16లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20శాతం పన్ను
రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను
ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల వరకు పన్ను మినహాయింపు
Union minister Nirmala Sitharaman budget 2025 pic.twitter.com/ElkNpvw3lp
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 1, 2025