–ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి
–గాయపడిన మరో పదిహేను మంది
–మృతుల్లో యూపీ, బీహార్ కు చెందిన కార్మికులు
Building collapse: ప్రజా దీవెన, గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ (surat)లో ఆరు అం తస్తుల భవనం కుప్పకూలింది. సూరత్ లోని సచిన్ పాలి గ్రామంలో శనివారం రాత్రి దాటిన తర్వాత ఆరు అంతస్తుల అపార్ట్మెంట్ (Six floor apartment) కుప్పకూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలవగా మరో 15 మంది గాయపడ్డారు. 2017లో నిర్మించిన ఆ అపార్ట్ మెంట్ అనూ హ్యంగా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోగా అందులో 30 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తు న్నాయి.
దీనికితోడు గత కొన్ని రోజు లుగా కురుస్తున్న భారీ వర్షాలకు (rains) తడిసి ముద్దైన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.ప్రమాద సమయం లో నైట్ డ్యూటీలు ముగించుకున్న వారందరు ఇళ్లలో నిద్రిస్తున్నారు. సూరత్ లోని వస్ర్త పరిశ్రమలో (Vasra industry) పనిచేసే యూపీ, బీహార్ కు చెందిన కార్మికులు భవనంలో నివసిస్తున్న ట్లు స్థానిక ఎమ్మెల్యే సందీప్ దేశా య్ తెలిపారు. ప్రమాదవార్త తెలి యగానే పోలీసులు, ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డీఆర్ ఎఫ్ సహాయ సిబ్బంది భవన శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు రంగం లోకి దిగారు. శనివారం రాత్రంతా శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. ఆదివారం ఉదయానికి ఏడు మృత దేహాలను వెలికితీసినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ (Chief Fire Officer Basant) తెలిపారు. సహా య చర్యలు ఇంకా కొనసాగుతు న్నాయని అయితే శిథిలాల కింద ఇంకెవరూ చిక్కుకోలేదని భావి స్తున్నట్లు పేర్కొన్నారు.