Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CAR ACCIDENT: రివర్స్ గేర్ లో జీవితం

–కారు రివర్స్ గేర్ లో కాలగర్భంలో కలిసిన యువతి
–మహారాష్ట్రలో దురదృష్టకర విషాద సంఘటన

CAR ACCIDENT: ప్రజాదీవెన, ఔరంగాబాద్: కారు రివర్స్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు కొండపై నుంచి లోయలో పడి యువతి మృతి చెందింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మృతురాలి స్నేహితుడు రోడ్డుపై నుంచి చిత్రిస్తుండగా ఒక్కసారిగా కారు 300 అడుగుల లోయలో పడి పోయింది. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో (Maharashtra)చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా (VIRAL) మారింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం. శ్వేతా దీపక్ సుర్వాసే (23), సూరజ్ సంజౌ ములే (25) ఇద్దరు స్నేహితులు. వీరు సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్ (Aurangabad) నుంచి సులిభంజన్ హిల్స్‌కు వెళ్లారు. ఈ వీడియోలో శ్వేతా దీపక్ సుర్వాసే (23) కారు డ్రైవర్ సీటులో కూర్చుడిన కారుని నెమ్మదిగా రివర్స్‌ చేయడం కనిపిస్తుంది. ఆమె స్నేహితుడు సూరజ్ సంజౌ ములే (25) ఆమెకు ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తూ వీడియోను రికార్డ్ (RECORD) చేస్తుంటాడు. శ్వేతా కారును నెమ్మదిగా వెనక్కి తిప్పడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆమె కారును అలాగే 50 మీటర్ల దూరం బ్యాకప్ చేస్తూ వెళ్లడంతో.. ఒక్కసారిగా కారు వేగం పెరుగుతుంది. ఆమె స్నేహితుడు సూరజ్‌ స్లో చేయమని పదేపదే హెచ్చరించడం కూడా వీడియోలో కనిపిస్తుంది. కారు ఇంజిన్ రివ్స్ అవుతుండగా ‘క్లచ్, క్లచ్, క్లచ్.. నొక్కమని’ అరుస్తుంటాడు. కారు బ్రేక్‌ వేసేందుకు సూరజ్‌ పరిగెట్టడం వీడియోలో కనిపిస్తుంది. కానీ అప్పటికే ప్రమాదం అంచువరకు కారు వెళ్లడం.. జరుగుతుంది. కానీ ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తైనా కొండపై నుంచి కారు (CAR) లోయలో పడి, నుజ్జనుజ్జయిపోతుంది. ఈ ఘటనలో శ్వేతా అక్కడికక్కడే మృతి చెందింది.