–నీట్ లో సమూల సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కమిటీ
–పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ డీజీపై వేటుతో ప్రారంభం
–నేటి నీట్ పీజీ వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన
–నష్ట నివారణ చర్యలతో రంగంలోకి దిగిన కేంద్రం
–పరీక్షల పవిత్రత కాపాడెందుకు దేనికీ వెనుకాడబోమని ప్రకటన
CBI: ప్రజా దీవెన,న్యూఢిల్లీ: దేశ వ్యాప్తం గా గడిచిన రెండు వారాలుగా కొనసాగుతున్న నీట్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతున్న తరుణంలో కేంద్రం (CENTRAL)నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ విషయంలో ఓవైపు విద్యార్థులు మరోవైపు రాజకీయ పక్షాలు గగ్గోలు పెడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రక్షా ళన దిశగా అడుగులేస్తుంది. విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జా తీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీ, యూజీసీ, నెట్ (NEET) ప్రవేశ పరీక్షల లీక్ (PAPER LEAK) వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తి, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తినడం, సోమవా రం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అదే ప్రధాన అంశం అయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. శని వారం మధ్యాహ్నం నుంచి ఉన్న ఫలంగా పలు నిర్ణయాలు తీసు కుంది. మొదట నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. తర్వాత ఎన్‌టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది.
అసలు ఎన్ టీఏకు లోపాల్లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకొనే వరకు పరీక్షల నిర్వహ ణకు విరామం ప్రకటించే కార్యక్ర మంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను వాయిదా (Adjournment) వేసింది. చివరగా శనివా రం రాత్రి నీట్ లీక్ వ్యవ హారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి కొద్ది గంటల ముందు కేంద్రం నేష నల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోద్ కుమార్ సింగ్పై (Subodh Kumar Singh) వేటేసింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ కరో లాకు ఎన్డీఏను అదనపు బాధ్యతగా అప్పగించారు. సుబోద్ కుమార్ సింగ్ను కంపల్సరీ వెయిట్లో ఉంచారు. సుబోధ్ కుమార్ సింగ్ ఎన్టీఏ డీజీ హోదాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు (Grace marks) ఇచ్చి నీట్-యూజీ పరీక్షపై వివాదానికి తెర తీశారు. సుబోడ్పై వేటు సమయంలోనే అది వారం (జూన్ 23న) జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. వరుసగా రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు ఎన్బీఏ పరీ క్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్థ యించారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటించనున్నారు.
నీట్ (NEET) తదితర పోటీ పరీక్ష లను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీ ఏ)ను సంస్కరిస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ (K. Radhakrishnan) నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని తెలి పింది. ఎన్టీఏ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం, ఎన్టీఏ డేటాను భద్రపరిచే పద్ధతులను, ఎన్టీఏ నిర్మాణం, పనితీరును, పరీక్షలు నిర్వహించే తీరును మెరుగు పరచడానికి సలహాలు ఇస్తుందని చెప్పింది. యూని వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ విజెరాము చెల్లి ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్ప్ గులేరియా, ఐఐటీ (IIT) మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ రమణమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ ఆదిత్య ని ఎట్టల్, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైశ్వాల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రకటిం చింది. పరీక్షల వ్యవస్థ సామర్ధ్యాన్ని మెరుగుపరచ డంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు తొలి అడుగని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. అన్ని రకాల అక్రమాలకు అవకాశాలను మూసేస్తామని చెప్పారు. మొత్తం ఎన్బీఏ వ్యవస్థనే ప్రక్షాళిస్తామని ప్రకటించారు. పేపర్ కూర్పు మొదలు ఫలితాల విడు
వీచ్కు వ్యతిరేకంగా వారాణసీలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన, పట్నాలో నిరసన ప్రదర్శన
దల వరకు అన్ని దశల్లో ఇప్పటికే ఉన్న విధానాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఎన్ టీఏ (NTA) ఆధ్వర్యంలో జరిగిన నీట్, యూజీసీ-నెట్ పరీ క్లలు లీక్ అయినట్లు తేలింది. నీట్పై నిర్ణయం తీసు కోవాల్సి ఉండగా, యూసీజీ-నెట్ను రద్దు చేశారు.
విపక్షం ఒత్తిడి పని చేసింది.
ఎన్టీఏ (NTA)పరీక్షలకు సంబంధించి పదేపదే లీకుల ఆరోపణలు రావడం, విద్యార్థులకు కలిగిన ఇబ్బం దులు, వారిలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు, బలం పుంజుకున్న విపక్షం ఒత్తిడి… వెరసి అన్నీ కలిసి సుబోద్ కుమార్ సింగ్పై వేటు వేయక తప్పని పరిస్థి తిని కల్పించాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా. ప్రభుత్వంపై పని చేశాయి. ఎన్డీఏను ప్రక్షాళిస్తా మని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో ప్రకాశనలో సుబోధ్ కుమార్ సింగ్ను వెళ్లగొట్టాడాన్ని భాగంగా చూడవచ్చని
నీట్-పీజీ తేదీలు మళ్లీ ప్రకటిస్తారు
వదుసగా రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయిన నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ (NEET) పరీక్ష లను వాయిదా వేశారు. ముందు ఎన్డీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణ యించారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తార నేది తర్వాత ప్రకటించనున్నారు. ఈ పరీక్షలు కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. జూన్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరగాల్సిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (UGC Net) పరీక్షలను శుక్రవారం రాత్రి వాయిదా వేశారు. లాజిస్టికల్
అంటున్నారు. శనివారమే ఆయన లీకుల ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ అగ్ర నాయకత్వం మొత్తం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI)స్వయంగా ధర్మేంద్ర ప్రదాన న్ను చర్యలు కనిపించాలని ఆదేశించారు. ఫలితంగానే వేటు పడిందని భావిస్తు న్నారు. పేపర్ లీక్ ఆరోపణను మూలాల వరకు దర్యాప్తు చేసి, అసలు దోషులను పట్టుకోవడం తమ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టులో నీట్ లీకేజీ కేసు జూలై 8న విచారణకు రానుంది. కోర్టు కూడా నీట్ రద్దు చేయలే మని, ఆరోపణల నిజానిజాలు తేల్పమని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తులో పురోగతి సాధించడం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. పరీక్షల పవిత్ర తను, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. నీట్-పీజీ వాయిదా వార్త వెలువడగానే కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (JAYARAM RAMESH)స్పందించారు. ఏదో ఒక పరీక్ష రద్దు/వాయిదా లేకుండా రాత్రి తెల్లారడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థ కుళ్లిపోయిందని చెప్పడానికి నీట్-పీజ్ వాయిదా మరో దురదృష్టకర ఉదాహరణ అని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ రాకెట్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ (PM MKDI) ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మారారని అన్నారు. ఆయన అస మర్థ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుకు పెద్ద ప్రతిబం ధకం కానుందని చెప్పారు.