Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phone tapping :మీకు సిబిఐ విచారణపై మీనమేషాలెoదుకు

ఫోన్ టాపింగ్ విచారణ పరదర్శకంగా జరుగుతోందని ఆ విషయంలో ఇంతవరకు నేను సమీక్ష జరపలే దని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు.

ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం
నిపుణులు చెప్పినట్లే కాళేశ్వరంపై ముందుకు వెళ్తాం
పోలీసుల పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోను
త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా రాష్ట్ర చిహ్నం, గీతం
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు రావాలని సోనియాను స్వయంగా ఆహ్వానించాం
ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన న్యూఢిల్లీ: ఫోన్ టాపింగ్ విచారణ పరదర్శకంగా జరుగుతోందని ఆ విషయంలో ఇంతవరకు నేను సమీక్ష జరపలే దని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Enumula Revanth Reddy) పేర్కొన్నా రు. ప్రతి దానికి సిబిఐ విచారణ చేయించాలని కోరే మాజీ మంత్రు లు కెటిఆర్, హరీశ్ రావు లు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎందుకు కోరడం లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయబోదని, అలాంటి వెదవ పను లు తాము చేయబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23లోని సిఎం అధికారిక నివాసం నిర్మాణ పనులు పరిశీలించిన అనం తరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగోచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబి అధికారులు కేంద్ర నిఘా సంస్థల తోనే నేరుగా మాట్లా డతారు తప్ప, తనతో కాదన్నారు.

1980, 90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో బ్యాకప్ కూడా ఉందో లేదా దానిని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచా రణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. కనపడకుండా పోయిన హార్డ్ డిస్క్ లు, ధ్వంసం అయిన డేటా బాక్ అప్ ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చా ల్సి ఉందన్నారు. తీవ్ర వాదులు, జాతి వ్యతిరేక శక్తుల విష యంలో ఫోన్ ట్యాపింగ్(Phone tapping) జరగొచ్చని, గత ప్రభుత్వం దానిని దుర్వినియోగం చేసిందని సిఎం రేవంత్ వ్యాఖ్యానిం చారు. అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బది లీల్లో ఎస్ఐబి కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ట్యా పింగ్ వ్యవహారం బయటకు వచ్చిం దని ఆయన తెలిపారు.

ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు వారి పని వారు చేసు కుంటూ పోతున్నారని ఆయన చెప్పారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తన కు తెలుసునన్నారు. తమ పాల నలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నా రు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు(Elections) జరిగాయన్నారు. తెలంగా ణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అన్నారు. తెలం గాణ అంటే త్యా గాలు, పోరాటాలు గుర్తొస్తాయని ఆయన వెల్లడించారు. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొం దిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలం గాణ అధికారిక చిహ్నం ఉండబో తుందన్నారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని ఆయన వెల్లడించారు.

సమ్మక్క, సారక్క నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందని, పోరాటాలు, త్యాగా లకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుందని సిఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర గీత రూపక ల్పన బాధ్యతలు అందెశ్రీకి(Andeshri) అప్పగించా మని, రాష్ట్ర చిహ్న రూపకల్పన బాధ్యతలు ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సి పల్ అయిన నిజామాబాద్ బిడ్డకు అప్పగించినట్టు సిఎం రేవంత్ వివరించారు. తెలంగాణ(Telangana) గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించినట్లు సిఎం రేవంత్ తెలిపారు. సంగీత దర్శకుడు కీరవా ణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగానే ముందుకు వెళతామని చెప్పారు.

మేడిగడ్డపై(Madigadda)జ్యుడీషియల్ విచారణ నివేదిక లా తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాళేశ్వరం సమ స్య 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చేది కాదని, విరిగింది వెన్నెముక అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తు తం కాళేశ్వరంలో నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. 52 టిఎంసిల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన నీటికి కరెంట్ బిల్లులు(Current Bills) కట్టామన్నారు. కెసిఆర్(KCR) అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించాల్సి ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తెలిపారు. ఏ వ్యవ స్థను ఇప్పటి వరకు దుర్వినియోగ పరచలే దన్నారు రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈదురు గాలుల కారణం గా చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫ రాలో కొంత అంతరాయం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. పునరుద్ధరణ విషయంలో కొంత సమయం తీసుకొని ఉండవచ్చు అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పెరిగిందని, అందుకు అనుగు ణం గా ఎక్కడా సమస్యలు రాకుండా చేసినట్లు ఆయన చెప్పారు.

CBI investigation on Phone tapping