CEC serious on AP CS and DGP: ఏమి చేస్తున్నారు నిద్రపోతున్నారా
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో చెలరేగిన అల్లర్ల పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసు కున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్ర స్ధాయిలో మండిపడింది.
ఏపీ సీఎస్, డీజీపీలపై సిఈసి తీవ్ర స్థాయిలో అసహనం
పోలింగ్ అనంతరం జరిగిన హింసపై ఆగ్రహం
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్,తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ
డీఎస్పీ నుంచి ఎస్సై వరకు మొత్తంగా 12 మందిపై వేటు
హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నకు సిట్ నియమకం
రెండు రోజుల్లో సమగ్ర నివేదికకు ఎన్నికల కమిషన్ ఆదేశం
కౌంటింగ్ తర్వాతా కేంద్ర బలగాల మోహరింపు, 15 రోజులపాటు 25 కంపెనీలతో బందోబస్తు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections in Andhra Pradesh) చెలరేగిన అల్లర్ల పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసు కున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission) తీవ్ర స్ధాయిలో మండిపడింది. గతంలో లేని విధం గా స్పందించిన ఎస్పీలు, జిల్లా కలె క్టర్లు, 12మంది దిగువస్థాయి పోలీ సు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నా నిద్రావస్థలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తంచేస్తూ ఏపీలో ఏం జరుగుతోంది స్వయంగా వచ్చి వివరణ ఇవ్వండి అని ఆదేశిం చడంటో గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ విశ్వజీత్ ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్‌సింగ్ సంధూ ముందు హాజర య్యారు. ఈ భేటీలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలపై ఈసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఏపీలో పోలింగ్(Andhra Pradesh polling) అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశాం. ఇలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా ఎస్పీలు తగిన చర్యలు తీసుకు నేలా చూడాలని సీఎస్, డీజీపీలకు ఘాటుగా, సూటిగా చెప్పాం అని ఈసీ వెల్లడించింది. ఆయా ఘట నలకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన నివేదికను, సిఫారసు లను పరిశీలించి తదననుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు.
కట్టడికి కఠినమైన చర్యలు…అల్లర్లు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన పల్నాడు ఎస్పీ గరి కపాటి బిందుమాధవ్, అనంత పురం ఎస్పీ అమిత్ బర్దార్‌లను ఈసీ సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను బదిలీ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్‌పైనా ను బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు 12 మంది అధికా రులను సస్పెండ్ చేయాలని ఆదేశిం చింది. అంతటితో ఆగకుండా వీరందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవ హారాలపై ప్రత్యేక దర్యాప్తు బృందా లను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వా లని ఆదేశించింది.
ఆయా సంఘట నలపై ఇప్పటికే దాఖలైన ఎఫ్‌ఐ ఆర్‌లను సవరించి అవసరమైన మేరకు అదనపు సెక్షన్లు జోడిం చాలని ఆదేశించింది. ఈ కేసుల్లో నిందితులపై చట్ట ప్రకారం చార్జి షీట్లు దాఖలు చేయాలని, అది కూడా ఎన్నికల ప్రవర్తనా నియ మావళి ముగిసేలోగానే చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించా లని స్పష్టం చేసింది.ఫలితాల వెల్లడి తర్వాతా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు న్నందున 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)ను ఇక్కడే కొనసాగించా లని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆ బలగాలను కౌంటింగ్ తర్వాత 15 రోజులపాటు ఏపీలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలోనే డీజీపీతో(DGP) మొదలుకుని ఎస్‌ఐల వరకూ బాధ్యులను చేస్తూ చర్యలకు ఉపక్రమించింది. ఇంత మందిపై చర్యలు తీసుకోవడం, పోలింగ్ తర్వాతా ఈసీ కొరడా ఝళిపించడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
CEC serious on AP CS and DGP