Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Championcrickettrophy : ఆసీస్ పై భారత్ అదిరేపోయే విజ యo, ఫైనల్‌కు టీమిండియా

ఆసీస్ పై భారత్ అదిరేపోయే విజయo, ఫైనల్‌కు టీమిండియా

Championcrickettrophy:   ప్రజా దీవెన, హైదరాబాద్: ఉ త్కంఠ భరిత వాతావరణం లో టీమిం డియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయ స్ అయ్య ర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించ డంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నా లుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. అక్షర్ పటేల్ (27), రోహిత్ శర్మ (28) కూడా చెప్పుకోదగిన స్కోర్లు సాధించారు.

చివర్లో హార్దిక్ పాం డ్యా (28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రే లియా నిర్దేశించిన ల క్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్ల లోనే ఛేదిం చింది. ఆదివారం దుబా య్‌లో జరగబోయే ఫైనల్ మ్యా చ్‌లో తల పడబోతోంది.అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) రాణించ డంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరు గులు చేసింది. భారత్ ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (39), మిడిలార్డర్‌లో లంబుషేన్ (29) కూడా రాణించారు.

టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. వరు ణ్ చక్రవర్తి, జడేజా రెండేసి వికెట్లు పడగొ ట్టారు. అక్షర్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీ మిం డియా ఆరంభంలో కాస్త తడబ డింది. రోహిత్ ఇచ్చిన రెండు క్యా చ్‌లను ఆసీస్ ఫీల్డర్లు వదిలే శారు. గిల్ (8) స్వల్ప స్కోరుకే అవుట య్యాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ వికెట్ల పత నాన్ని అడ్డుకున్నారు.

సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. శ్రేయస్ తర్వాత వచ్చి న అక్షర్, కేఎల్ రాహుల్ కూడా కోహ్లీతో భాగస్వా మ్యాలు నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.కాగా, బుధవారం లాహోర్‌లో జరబోయే సెమీస్‌లో న్యూజిలాం డ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతా యి. ఆ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఆదివారం టీమిండియా తో ఫైన ల్‌లో తలపడనుంది.