ఛత్తీస్ గఢ్ లో మరో ఎనౌకౌంటర్ –ఏడుగురు మావోయిస్టులు మృతి
లోక్ సభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ దండ కారణ్యం మరోసారి తుపాకీ కాల్పు ల మోతలతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాల సరిహద్దు ల్లో
ప్రజా దీవెన, నారాయణపూర్: లోక్ సభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్(Chhattisgarh) దండ కారణ్యం మరోసారి తుపాకీ కాల్పు ల మోతలతో దద్దరిల్లింది. కాంకేర్( Kanker), నారాయణ్ పూర్(Narayanpur) జిల్లాల సరిహద్దు ల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బం ది మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ హతమ య్యారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాం తంలో పెద్ద సంఖ్యలో మావోయి స్టులు ఉన్నట్లు పోలీసులకు సమా చారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి.
సోమవారం రాత్రి నుంచి గాలింపు చేపట్టి మంగ ళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఏడుగురు నక్సల్స్ మృతిచెందగా మరికొందరు తప్పిం చుకున్నారు.
భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసా గుతోంద ని పోలీసులు వెల్లడిం చారు. ఇటీవ ల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్(Encounter) లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక్కడ కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన అగ్రనాయకులు ఉన్నారు.
Chhattisgarh Kanker Narayanpur