New virus: చైనాలో మరో కొత్త మహమ్మారి..!
2020లో కరోనా మహమ్మారి ప్రపంచమంతా వణికించింది. ఈ వైరస్ తో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా విష యం తెలిసిందే. కొంతమంది శాస్త్ర వేత్తలు
వైరస్ బారిన పడితే అంతే సంగతులు
హెబీ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: 2020లో కరోనా మహమ్మారి ప్రపంచమంతా వణికించింది. ఈ వైరస్ తో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా విష యం తెలిసిందే. కొంతమంది శాస్త్ర వేత్తలు ముందుకు వచ్చి చైనాలోని(China) వుహాన్ ల్యాబ్ నుండి కరోనా వైరస్ ఉద్భవించిందని చెప్పారు. కాని చై నా మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వ లేదు. పైగా ఈ విషయం పై ఖండిం చింది కూడా ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి బయటపడు తుండగా తాజాగా మరో భయం కరమైన విషయం ప్రజల్లో ఒణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు మరోసారి చైనా కొత్త వైరస్ ను సృష్టించినట్లు తెలుస్తోంది.
అవును ప్రపంచాన్ని నాశనం చేసిన కరోనా వైరస్ కు(Corona virus) పుట్టినిల్లు అని చెప్పుకునే చైనాలో మరో వైరస్ గురించి చర్చ మొద లైంది. తాజాగా చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవే త్తలు(Hebei Medical University scientists) కేవలం మూడు రోజుల్లోనే ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్ ను సిద్ధం చేశారు. ‘సైన్స్ డైరెక్ట్'(Science Direct) మ్యాగ జైన్లో లో ప్రచురించిన ఈ పరిశోధ నలో ఈ విషయం వెల్లడైంది. ఎబో లా వైరస్ ను అనుకరించేందుకు శాస్త్రవేత్తలు సింథటిక్ వైరస్ ను(synthetic virus) ఉపయోగించినట్లు సమాచారం. వ్యాధికారక ప్రభావాలను అధ్యయ నం చేసేందుకు హెల్త్చైనీస్ శాస్త్ర వేత్తలు కొత్త వైరస్ ఎబోలాను సృష్టించినట్లు తెలుస్తోంది. ఎబోలా వైరస్ ను పోలిన ఈ కొత్త సింథటిక్ వైరస్ ను ఇటీవల దాదాపు 10 చిట్టెలుకలపై పరీక్షించారు.
టీకా వేసిన 3 రోజుల తర్వాత చిట్టెలు కలలో తీవ్రమైన లక్షణాలు కనిపిం చడం ప్రారంభించాయని నివేదికలు చెబుతున్నాయి. మల్టీ ఆర్గాన్(Organ) ఫెయి ల్యూర్ కారణంగా మూడు రోజుల్లో నే మృతి చెందినట్లు సమాచారం. ఈ చిట్టెలుకలు చనిపోయిన తర్వా త, పరిశోధకులు వాటి అవయవా లను పరిశీలించగా వైరస్ ను వాటి శరీరంలోకి పంపించినప్పుడు చిట్టె లుక కళ్లకు ఇన్ఫెక్షన్ సోకిందని, దాని కారణంగా వాటి దృష్టి బల హీనంగా మారిందని గమనించారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేగులు, మెదడు వంటి కణజాలాలలో వైరస్ పేరుకు పోతుందని ఎబోలా వైరస్ లాగా ఇది శరీరంలోని కణాలకు సోకు తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల ప్రయోజనాలు, ఇంకా ఎలాంటి ప్రాణహాని కలుగుతుందోనని సర్వ త్రా తీవ్ర చర్చ మొదలైంది. ఈ భయంకరమైన వైరస్ బారి నుండి విరుగుడు కనిపెట్టేందుకు అగ్రరాజ్య శాస్త్రవేత్తలు(Scientists)పరిశోధనలు చేస్తు న్నారు. ఇదిలా ఉంటే 2014 నుంచి 2016 మధ్యకాలంలో ఆఫ్రికన్ దేశా లలో ఎబోలా వైరస్(Ebola virus)ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కల్పో యారు.
China seems created new virus