Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CIBIL Score : వింత పోకడలు, సిబిల్ స్కోర్ తక్కువుoదని పెళ్లి క్యాన్సల్

CIBIL Score : ప్రజా దీవెన, మహారాష్ట్ర: భార తదేశంలో వింతపోకడలు విపరీ తంగా కొనసాగుతోన్నాయి. ఎవరు ఏ కారణం చేత ఏం చేస్తున్నారో అ ర్థం కాని తాజా పరిస్థితులు అంద రిని ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశం లోనే తెలిసినంతవరకు మొట్టమొ దటి సంఘటనగా చెప్పుకునే విం తైన విస్తుగొలిపే సంఘటన మహా రాష్ట్రలో జరిగింది. ఫస్ట్ టైం సిబిల్ స్కోర్ ఆధారంగా పెళ్లి రద్దు కావ టం గమనార్హం. ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా ఓ అర్హతగా లిస్టులో చేరిపోయింది కాబట్టి ఇక మగాళ్ల కు పెళ్లిళ్లు అయినట్లే అని ముచ్చ ట్లు ప్రారంభమయ్యాయి.

ఇక పెళ్లి ళ్లు అయినట్లే, సిబిల్ స్కోర్ తక్కు వ ఉందని పెళ్లి రద్దు చేసుకున్న అ మ్మాయి పెళ్లి అంటే అటు ఏడు త రాలు ఇటు ఏడు తరాలు చూ డాలనేది పాత సామెత, మారుతు న్న కాలంతో అమ్మాయికి అబ్బా యి, అబ్బాయికి అమ్మాయి నచ్చి తే చాలు అనే వరకు మొన్నటి వర కు ఇచ్చింది. నిన్నటి వరకు మాత్రం అమ్మాయి అయితే చాలు అబ్బా యి అయితే చాలు అనే వరకు వచ్చింది, ఇప్పుడు కొత్తగా సిబిల్ స్కోర్ తన వంతు పాత్ర పోషిస్తుం ది. అవును మరి అబ్బాయి సిబిల్ స్కోర్ (మన లావాదేవీలకు సంబం ధించి ఇచ్చే రేటింగ్) (Cibil Scor e) వరకు వచ్చింది. అబ్బాయి సిబి ల్ స్కోర్ సరిగా లేదని, స్కోర్ చా లా తక్కువగా ఉందనే కారణంతో ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నది అమ్మాయి కుటుంబం.

మహారాష్ట్రలో సంచలనంగా

మహారాష్ట్ర రాష్ట్రం ముర్తిజాపూర్ ప్రాంతానికి చెందిన కుర్రోడు. ఐటీ ఉద్యోగి. ఉద్యోగానికి తగ్గట్టు జీతా నికి తగ్గట్టు నాలుగు, ఐదు లోన్లు తీసుకున్నాడు. దర్జాగా బండి, ఇ ల్లు కొన్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని సంబంధాలు చూ శారు ఇంట్లో పెద్దలు. ఓ సంబంధం వచ్చింది. రెండు కుటుంబాలకు న చ్చింది. జాతకాలు కూడా కలిశా యి. కట్నకానుకలు, పెట్టుబడులు, కళ్యాణ మండపాలు అన్నీ మాట్లా డుతున్నారు. మంచి ముహూర్తం లో పెళ్లికి రెడీ అయ్యాయి రెండు కుటుంబాలు. పెళ్లి సంబంధం అం తా ఒకే అనుకున్న సమయంలో అ మ్మాయి నాన్నకు ఓ డౌట్ వచ్చింది. అబ్బాయి బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబర్ తీసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేశాడు. అబ్బాయి సిబిల్ స్కోర్ త క్కువగా ఉందని రిపోర్ట్ వచ్చింది. షాక్ అయ్యాడు. ఆర్థిక లావాదే వీలు సరిగా లేవని, అప్పులు ఎక్కు వగా ఉన్నాయని ఇలాంటి అబ్బా యికి మా అమ్మాయిని ఇచ్చేది లే దని డిసైడ్ కావడం పెళ్లి రద్దు చేసు కోవడం వెంటవెంట జరిగిపోయా యి.

లబోదిబోమంటున్న అబ్బా యి …అబ్బాయి మాత్రం లబోది బో అంటున్నారు. EMIలు ఉన్నా యని బండి, ఇంటికి ఈఎంఐ కడు తున్నానని దుబారా కోసం అప్పు లు చేయలేదని దీని వల్లే సిబిల్ స్కో ర్ తక్కువగా వచ్చిందంటూ నెత్తీనోరూ బాదుకున్నాడు. అయి నా సరే అమ్మాయి తండ్రి మాత్రం పెళ్లి రద్దు చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు బిల్లులు కూడా నువ్వు సరిగా చెల్లించటం లేదు అలాంటి నీకు పె ళ్లి ఎందుకు అంటూ వెళ్లిపోయింది ఆ సంబంధం.

దేశంలోనే మొదటి సారి ఇలా సిబి ల్ స్కోర్ కారణంగా పెళ్లి రద్దు కావ టం చర్చనీయాంశం అయ్యింది. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటీ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందించే స్కోరు. ఇది సాధారణంగా 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాం కు లు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఎ క్కువగా త్వరగా అప్పులు ఇస్తా యి. తీసుకున్న అప్పులకు మనం చెల్లించే విధానాన్ని బట్టి ఈ స్కోర్ ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అప్పులు త్వర గా ఇవ్వకపోగా ఇచ్చేది కూడా చా లా తక్కువగా ఉంటుంది.