Jammu Kashmir Cloudburst : ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: భారత దేశంలో భారీ వర్షాలు, వరదల కార ణంగా ప్రకృతిప్రకోపంతో ప్రజలు ప్ర భావితమై అల్లాడిపోతున్నారు. అక స్మాత్తు ప్రకృతి వైపరిత్యాలు జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ లో మరో మారు మళ్లీ మేఘాలు విస్పోట నమై రాంబన్, రియాసి జిల్లాల్లో ఘోర ప్రకృతి విలయం సంభవించిం ది. దీంతో దాదాపు 12 మంది మర ణించారు.
రియాసి జిల్లా మహోర్ లో కొండచ రియలు విరిగిపడి ఏడుగురు మృ తి చెందగా మేఘాల విస్ఫోటనం సంభవించి నివాస భవనం నేలమ ట్టం కావడంతో అందులోని వారు మృత్యువాత పడ్డారు. మరో వైపు రాంబన్ జిల్లా రాజ్ గడ్ లో క్లౌడ్ బ రస్ట్ కారణంగా వరదల ధాటికి ము గ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. సహాయక బృందా లు సంఘటనాస్థలికి చేరుకొని చ ర్యలు చేపట్టాయి.
అర్థరాత్రి12 గంటల ప్రాంతంలో ఇ క్కడ మేఘం విరిగిపడి భారీ వర్షం కురిసింది. ఉదయం గ్రామస్తులకు ఈ విషయం తెలియగానే, చాలా ఇ ళ్ళు శిథిలాల కుప్పగా మారి పో యాయి. రియాసిలో మేఘం వి స్ఫోటనం కారణంగా ప్రాణాలు కో ల్పోయిన ఏడుగురిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇంకా సహా యక చర్యలు కొనసాగుతున్నాయి.