Modi Speech: కాంగ్రెస్, బిఆర్ఎస్ లే అవినీతికి ఆనవాళ్లు
తెలంగాణ లో గత, ప్రస్తుత పాలకులు బిఆర్ ఎస్, కాంగ్రెస్ పాలకులు అవినీతికి ఆనవాళ్లని, అందులో నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నా రని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో బిజెపి కి స్పష్టమైన మెజార్టీ
ఆంధ్రప్రదేశ్ లో కూటమికి ప్రజల ఆదరణతో మార్పు తథ్యం
కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ కఠో రమైన అబద్ధాలే
రేవంత్ చాలా తొందరపడుతు న్నాడు, ఎంతో నేర్చుకోవాల్సి ఉంది
ఏపి ప్రజల ఆకాంక్షల మేరకే బా బు, పవన్ లతో పొత్తు
ప్రైవేట్ టీవీ చానల్ ముఖాముఖి లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ లో గత, ప్రస్తుత పాలకులు బిఆర్ ఎస్, కాంగ్రెస్(Congress) పాలకులు అవినీతికి ఆనవాళ్లని, అందులో నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నా రని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ బిజెపి కి స్పష్టమైన మెజార్టీ కనబడుతుందని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో సైతం కూటమికి ప్రజల ఆదరణతో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు.
ప్రాంతీయ ఆకాం క్షలను మేం గౌరవిస్తామని, అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో పొత్తు పెట్టుకున్నామని, కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉండాలంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ ఆకాంక్షలను తప్పనిసరిగా గౌరవించాలన్నది మా అభిమతమని అని వ్యాఖ్యా నించారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఆయన ప్రస్తావిస్తూ తెలంగాణ,(Telangana) ఆంధ్రప్రదేశ్ లలో జరుగుతున్న రాజకీయ పరి ణామాలపై ఓ ప్రయివేటు టీవీ ఛా నల్ ముఖాముఖి లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అవినీతిలో ఒక్కటేనని స్పష్టం చేశారు. రెండు పార్టీలు దొందూ దొందేనని వ్యాఖ్యా నించారు. లిక్కర్ స్కామ్ లో బి ఆర్ ఎస్,(BRS) ఆప్ కు కలిసి పనిచే శాయని, ఇప్పుడది పంజాబ్ కు సైతం పాకుతోందన్నారు. తెలంగా ణలో రేవంత్ సర్కార్ అవినీతి గురించి ప్రస్తావిస్తూ కమీషన్ లేకుం డా తెలంగాణలో ఏ ఒక్క పనీ జరగడo లేదని, డబుల్ ఆర్ పన్ను గురించి మాట్లాడుతూ తెలుగు వారికి ట్రిపుల్ ఆర్ ఎంత పెద్ద ఎత్తు న హిట్ అయిందో తెలుసునని, ప్రస్తుతం అంతేస్థాయలో తెలంగా ణాలో డబుల్ ఆర్ పన్ను వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపిం చారు.
మొత్తం నల్లడబ్బు ఇప్పుడు ఢిల్లీకి చేరుస్తున్నారని రేవంత్(Revanth) స ర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని బడేభాయ్ అని సీఎం రేవంత్ చేసి న వ్యాఖ్యలను గురించి ప్రస్తావిస్తూ, పెద్దవారు, అనుభవజ్ఞుల నుంచి చిన్నవాళ్లు చాలా నేర్చుకోవాలని, ఒక రాష్ట్రానికి సీఎంగా, ప్రధాన మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన వాడిగా నేను గుర్తింపు పొందానని, నాపై ఒక్క మచ్చ కూడా లేదని, నన్ను పెద్దన్న అని వెంటపడడం కాదు చూసి నేర్చుకోవాలని రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ప్రభుత్వమే, పర్సనల్ పర్సనలే అని మోడీ అన్నారు. తనను బడేభాయ్ అని సంభోదిం చినందుకు సంతోషమని పేర్కొ న్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రధాని మోడీ చాలా ఆస క్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్డీయేలోకి వచ్చిపోయిన చంద్రబా బు నాయుడుతో మళ్లీ ఎలా పొత్తు పొట్టుకున్నారని ప్రశ్నించగా ప్రాంతీ య ఆకాంక్షలను గుర్తించడం బిజెపి(BJP) విధానమని గుర్తు చేశారు. ఈ దఫా ఇక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గు రించి కూడా ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో హంగ్ వస్తుందని, బిఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్(KCR) ఎన్నికల ప్ర చారంలో చెప్పడాన్ని ఆయన ప్రస్తా విస్తూ ఆయన చెప్పేవన్నీ అబద్దా లేనని కొట్టిపారేశారు. గతంలో ఆయన తనవద్దకు వచ్చి ఎన్డీయే లో చేరతానన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. తాము తెలం గాణలో విపక్షంగానే పోరాడ తామ ని చెప్పి పంపించి వేశానని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అన్నింటిలో పోటీ పడి కొట్లాడుకుంటున్నాయని, చివరకు పగ్గాలు భాజపాకు అప్పగించి త ప్పుకోవడం అనివార్యమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా తానిస్తున్న గ్యారంటీలన్నీ తెలంగాణకు కూడా వర్తిస్తాయని ఒక ఆంధ్రప్రదేశ్ లో చా లా బలంగా మార్పు కనిపిస్తోందని స్ప ష్టం చేశారు. ప్రాంతీయ ఆకాం క్షలకు అనుగుణంగానే తాము చంద్రబాబును ఎన్డీయేలోకి చేర్చు కున్నామని, చంద్రబాబు, పవన్ లు ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణం గా పోరాడుతున్నందునే తాము గౌరవిస్తున్నామని, ఇటీవల చిలక లూరిపేటలో జరిగిన అతి పెద్ద ర్యాలీలో కూడా ఏపీ ప్రజల్లో కొట్టొ చ్చినట్టు కనిపిస్తున్న మార్పును తాను గుర్తించినట్టు పేర్కోన్నారు .
ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణం గా కేసీఆర్ చెప్పేవన్నీ కఠోర అబద్దాలేనని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రె స్ పరిస్థితి దయ నీయంగా ఉందని, 250కి పైగా సీట్ల లో పోటీ చేయడానికే అవకాశం లేని పార్టీ హస్తినపై ఏవిధంగా ఆశ లు పెట్టుకుంటుందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ పది మంది రైతులు వంద అడుగుల లోతు బావిని తవ్వాలని నిర్ణయించుకుని ఒక్కొక్కరి పొలంలో పది అడుగుల చొప్పున తవ్వుకుంటూ పోతు న్నారని, వంద అడుగుల లోతు తవ్వకుండా వెడల్పు తవ్వితే ప్రయోజనమేంటని చమత్కరిం చారు. ఇండియా(India) కూటమిలో కూ డా గెలిస్తే ఏడాదికొకరు ప్రధానిగా పనిచేయాలనుకుంటున్నారని, ఇక దేశం ఏవిధంగా బాగుపడుతుందని ఎదురు ప్రశ్నించారు. ఒక్కసీటు గెలుపొందే పార్టీని కూడా తాము గౌరవించి ఎన్డీయేలో చేర్చుకుంటు న్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Congress and BRS corrupted parties