Modi speech: కాంగ్రెస్ కు కావాల్సింది ముస్లింలను మురిపించడం
మతపరమై న రిజర్వేషన్ లు రాజ్యాంగ విరు ద్ధమని తెలిసినా ముస్లీం లను ఏదో విధంగా మురిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
దేశాన్ని మళ్లీ విభజించాలని కాంగ్రె స్ కోరుకుంటుందనిపిస్తుంది
మతపరమైన రిజర్వేషన్లు ము మ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే
ఇరువై ఏళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్ లో పైలట్ ప్రాజెక్టుగా, 2011లో కూడా దేశవ్యాప్తంగా అమలుకు కాంగ్రెస్ యత్నం
మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే తిరిగి అదే ప్రయత్నం కొనసాగిస్తుంది
దక్షిణాదిని వేరు చేయాలని కర్ణాట క కాంగ్రెస్ నేత వ్యాఖ్యలే నిదర్శనం
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ర్యాలీల్లో కాంగ్రెస్‌పై మోదీ ధ్వజం
ప్రజా దీవెన, రాజస్థాన్: మతపరమై న రిజర్వేషన్ లు రాజ్యాంగ విరు ద్ధమని తెలిసినా ముస్లిం లను ఏదో విధంగా మురిపించేందుకు కాంగ్రెస్ (Congress)పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మతపరమైన రిజర్వేషన్ల అమలు దిశలో చర్యలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను అవమానపరిచిందంటూ మండి పడ్డారు. బీజేపీ(BJP) మూడోసారి అధికా రంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారు స్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోప ణలు అర్థరహితమని కొట్టి పారేశా రు.
ఇతరుల సంపదను దోచి, ము స్లింలకు పంచడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీల కోటాను తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టా రు.రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ(Modi) కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో మతప రమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, మీ ఆస్తులను ఎక్స్‌రే చేసి వాళ్లనుకున్న వారికి పంచాలని చూస్తోందని దుయ్యబ ట్టారు. దేశాన్ని విభజించాలన్నట్లు గా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతు న్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హనుమాన్ చాలీసాను వినడం కూడా నేరంగా మారిందని, రామనవమి వేడుకలపై రాళ్లదాడులు జరిగేవని విమర్శిం చారు. 2004 నుంచి ముస్లిం రిజర్వేషన్లే ఎజెండాగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించా రు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టుగా తన ప్రయత్నాలను ప్రారంభించిం దని, ఏపీ(AP)లో దళితులు, గిరిజనుల కోటాను తగ్గించి, ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాలని నాలుగు సార్లు ప్రయత్నించిందని విమర్శించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడంతో ఆ ప్రయత్నాలు సఫలమవ్వలేదని గుర్తు చేశారు.
2011లో కాంగ్రెస్ సర్కారు ఏకంగా దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లకు ప్రయత్నిం చిoదని కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లను(Reservations) రద్దు చేసిన విషయా న్ని తెలిపారు.నేను దేశ ప్రజలంద రికీ హామీ ఇస్తున్నా ఇది మోదీ గ్యా రెంటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వే షన్లు కొనసాగుతాయని, అంబేడ్క ర్ ఆశయాలను కాపాడుతామని మోదీ స్పష్టం చేశారు. నేను మూ డ్రోజుల క్రితం రాజస్థాన్‌లో 90 సెకన్లపాటు ఇచ్చిన ఉపన్యాసంతో కాంగ్రెస్ వస్తే మహిళల మెడల్లోని మంగళసూత్రాలను కూడా లాక్కొం టుందని అన్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో కల్లో లం మొదలైందన్నారు.
అవును నేను చెబుతున్నా కాంగ్రెస్ అధికా రంలోకి వస్తే ఆస్తులను ఎక్స్‌రే చేసి, వాటిని ఎంపిక చేసుకున్న కొందరికి పంచిపెడుతుందని పునరుద్ఘాటిం చారు. కాంగ్రెస్ ఓటుబ్యాంకు కుతంత్రాలను నేను బహిర్గతం చేస్తూ నేను నిజం చెబితే కాంగ్రెస్‌లో జంకు ఎందుకు, నేను వారి రహస్య ఎజెండాను బయటపెట్టాననేనా ఉలుకు అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో 2014లో కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చి ఉంటే ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై ప్రజలు రాళ్లు రువ్వే సంఘటనలు కొనసా గుతుండేవని, శత్రువులు సరిహద్దు ల్లో కాల్పులు జరిపేవి కూడా కొనసా గేవని ఆరోపించారు.
Congress divide india