Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Convener Gattagalla Sanjeeva : ఢిల్లీలో గాదరి అనూష కు సన్మానం

Convener Gattagalla Sanjeeva : ప్రజా దీవెన , కనగల్ : ప్రముఖ ధూమ్ దాం కళాకారుడు, కవి, గాయకుడు గాదరి అనూష కు ఢిల్లీలో ప్రజాయుద్ధనక ఏపూరి సోమన్న కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్టగళ్ల సంజీవగారి చేతుల మీదుగా అనూషకు ఘన సన్మానం జరిగింది.

ఇండియన్ కరెన్సీ నోట్ల మీద డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ జేరిపోతుల పరశురాం ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బుధవారం రోజున తెలంగాణ నుంచి వచ్చిన సుమారు 100 మంది కళాకారులతో ధూంధాం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు తెలుగు రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించిన మేధావి అంబేద్కర్ అని తెలిపారు. ఆనాడు పరాయి పాలనలో ఉన్న మన దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులని సరిదిద్ది, దేశంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద తప్పకుండా ముద్రించాలని అన్నారు.

అనంతరం ధూమ్ దాం లో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటెల రాజేందర్, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, అప్పలనాయుడు, ప్రసిద్ధ ధూంధాం కళాకారులు ఏపూరి సోమన్న, వొల్లాల వాణి, చెరుకు మల్లిక, ముక్కెర సంపత్, రామంచ భరత్, రేలారే గంగ తదితర 100 మంది కళాకారులు పాల్గొన్నారు.