Devil Hunt : ప్రజా దీవెన బంగ్లాదేశ్: ప్రపంచాన్ని యావత్తు తమ వైపు తిప్పుకొన్న బంగ్లాదేశ్ సంచలన సంఘటన పై చర్యలు ప్రారంభమయ్యాయి.బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కోసం అల్లర్లు సృష్టిస్తున్న వారిని అరెస్ట్ చేసేందుకు తాజాగా ఆపరేషన్ డెవిల్ హంట్ ను ప్రారం భించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా అల్లర్లు, విధ్వంసం సృష్టి స్తున్నారంటూ ఇప్పటికే 1308 మం దిని అరెస్ట్ చేసింది అక్కడి తాక్కా లిక ప్రభుత్వం. ఢాకా శివార్లలోని అ వామీ లీగ్ నాయకురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసంపై దా డి జరిగిన విషయం విదితమే . బం గబంధు షేక్ ముజిబుర్ హర్మాన్ స్మారక భవనంపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో భవనం, మ్యూ జియం పూర్తి ద్వంసమయ్యాయి.
ఈక్రమంలోనే అనేక మంది విద్యా ర్థులు, కార్యకర్తలు తీవ్రంగా గాయ పడ్డారు కూడా. ప్రజల అంతా కాస్త శాంతియుతంగా వ్యవహరించాలం టూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభు త్వాధినేత మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. అయినప్ప టికీ ఓ మంత్రిపై కూడా దాడి జరి గింది. అయితే ఇదంతా చేసిందే ఒకటే గ్యాంగ్ అని తెలుసుకున్న అధికారులు ఆ మేరకు ఈ ఆపరేష న్ డెవిల్ హంట్ ను ప్రారంభించా రు. ముఖ్యంగా గాజీపూర్ నుంచి మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా దీన్ని కొనసాగిస్తామని చెప్పారు.
సైన్యం, పోలీసులు, ప్రత్యేక విభాగాలు ఈ ఆపరేషన్ కొనసాగిస్తుండగా మొద టి 24 గంటల్లోనే 274 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల గాజీపూ ర్‌లోని దక్షిణ్ ఖాన్ ప్రాంతంలో హింస చెలరేగింది. మాజీ యుద్ధ వ్యవహారాల మంత్రి మొజమ్మెల్ హక్ ఇంటిపై మూకలు దాడి చే యగా14 మంది గాయపడ్డారు. అయితే నిరసనకారులు అంతా అవామీ లీగ్ చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. విషయం గుర్తించిన పోలీసులు 81 మంది అవామీ లీగ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.అదే రోజు సాయంత్రం డిప్యూటీ కమిష నర్ కార్యాలయం బయట ఓ వి ద్యార్థిని కాల్చి చంపారు. దీనికి ప్రతిస్పందనగా హింసను ఖండిస్తూ విద్యార్థి ఉద్యమం గాజీపూర్‌లో ఒక రోజు నిరసనను నిర్వహించిం ది. ఈక్రమంలోనే సర్కారు గట్టి చర్యలు తీసుకుని హింసకు పాల్ప డుతున్న వారిని అరెస్ట్ చేస్తూ వ స్తోంది. ఈ దాడులకు బాధ్యులైన వారిని ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయగా మిగతా వాళ్లను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతోంది.
అవామీ లీగ్ మద్దతుదారులను కావాలనే సర్కారు ఆపరేషన్ డెవి ల్ హంట్ పేరిట అరెస్టులు చేస్తుం దంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా బంగ్లా హోంమంత్రి వీటిని తోసి పుచ్చారు. డెవిల్ అం టే దేశ వ్యతిరేక శక్తులు అని అర్థ మని, దేశంలో విధ్వంసం, అల్లర్లు సృష్టిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొన సాగుతుందని స్పష్టం చేశారు.