— అమెరికా కాలేజీల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ అవకాశం
— గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే మంజూరు చేయాలి
–మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాద న
Donald Trump: ప్రజా దీవెన, వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో (In American colleges) చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరు చేస్తా మని ప్రకటించారు. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఆటోమేటిగ్గా గ్రీన్ కార్డు అందుకునేలా పాలసీ తీసుకొస్తానని తెలిపారు. దీనివల్ల చైనా, భారతీయ విద్యార్థులకు (Indian students) ఎంతగానో ప్రయో జనం కలుగుతుందన్నారు. వాస్తవా నికి ఈ కొత్త పాలసీ ఆయన గత వైఖరికి భిన్నంగా ఉంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా స్వదేశీ విధానం బై అమెరికన్ హైర్ అమెరికన్‌ను కఠినంగా అమలు చేశారు. అత్యంత నైపుణ్య సిబ్బంది, విద్యార్థుల వలసలపై కఠిన ఆంక్షలు విధించారు. ఇప్పుడు ప్రవాస భారతీయులు, చైనీయుల మద్దతు కూడగట్టుకునేందుకు వైఖరి మార్చారని అంటున్నారు.
గురువారం ఆయన వెంచర్ క్యాపి టలిస్టులు (Venture capitalists), టెక్ ఇన్వెస్టర్లతో పాడ్ క్యాస్ట్ (A podcast with tech investors ఇంటర్వ్యూలో మాట్లా డు తూ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. జూనియర్ కాలేజీలు సహా అమెరి కాలో ఏ కాలేజీలో చదివినా డిప్లొ మాలో భాగంగా గ్రీన్‌కార్డు కూడా అందుతుందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడం కోసం నిపుణులందరూ అమెరికా లోనే నివసించడం అవసరమని పేర్కొన్నారు. అయితే, అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించే కమ్యూనిస్టులు, ర్యాడికల్ ఇస్లామి స్టులు, హమాస్ మద్దతుదారులు, అమెరికా విద్వేషకులు, నేరాభియో గాలు ఉన్నవారికి ఇది వర్తించదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదన చట్టమైతే.. గ్రీన్‌కార్డుల సంఖ్య భారీ గా పెరుగుతుందని ఏటా 10 లక్షల మంది చైనా, భారత్ విద్యార్థులకు అమెరికా విద్యావకాశాలు కల్పిస్తోం దని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఆకస్మికంగా కొత్త పాలసీ ప్రతిపాదించడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ (Joe Biden) గత మంగళవారం కొత్త వలస కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీనిప్రకారం అమెరికన్ పౌరులను వివాహమాడేవారికి చట్టబద్ధమైన నివాస హక్కు, పౌరసత్వ హక్కు కల్పిస్తామన్నది దాని సారాంశం. ఇది బైడెన్‌కు, అధికార డెమోక్రాటిక్ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే అవకాశం ఉండడంతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఆటో మేటిక్ గ్రీన్‌కార్డు విధానం ప్రతిపా దించారని పరిశీలకులు వ్యాఖ్యాని స్తున్నారు. ఈ ఏడాది నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US presidential election) జరగనున్నాయి.