–అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్
Donald Trump: ప్రజా దీవెన, వాషింగ్టన్: తనపై జరిగిన కాల్పుల ఘటనపై ( shooting incident)అమె రికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఆ దాడిలో తాను చనిపోయాననే అనుకున్నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమెరికన్ వార్తా సంసంస్థ తో మాట్లాడారు. ‘అసలు నేను మీ ముందు ఉండేవాడినే కాదు. కాల్పు ల ఘటనలో చనిపోయాననే అను కున్న. ఇదొక చిత్రమైన పరిస్థితి’ అని ట్రంప్ (trump)చెప్పినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. ఆసమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉన్నట్లు పేర్కొంది. రిపబ్లిక్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో ప్రయా ణిస్తూ ట్రంప్ ఈ విధంగా స్పం దించారు.
‘ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు. కాల్పుల శబ్ధాలు వినగానే ఏదో జరుగతోందని అర్థమైంది. నాకుడి చెవి పైభాగం నుంచి బుల్లె ట్ దూసుకెళ్లింది’ అని స్పందించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమ వుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్‌పై(trump) దాడి జరగడానికి స్థానిక పోలీసుల వైఖరే కారణమని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ చెబుతోంది. థామస్ మాథ్యూ క్రూక్స్ పైకప్పు ఎక్కి గన్ పొజిషన్ (Mounted gun position) తీసుకున్నా పట్టించుకోలేదని చెబుతోంది. సమావేశం జరిగిన ఏజీఆర్ ఇంటర్నేషనల్ ఐఎన్‌సీ ఫ్యాక్టరీ గ్రౌండ్స్‌ను పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదే అని పేర్కొంది. నిందితుడు 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అంత దూరంలో రక్షణ బాధ్యత స్థానిక పోలీసులదే అని సీక్రెట్ సర్వీస్ ఆంటోనీ గుగ్లెమీ వెల్లడించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ ( New York Times) పేర్కొంది.