Driver died : ప్రజా దీవెన, లక్నో: సినిమా తరహలో ట్రాక్టర్లతో స్టంట్ చేయా లనుకున్న ప్రబుద్దుడి ప్రయత్నం బెడిసికొట్టింది. అదుపుతప్పి ఒక ట్రాక్టర్ బోల్తాపడి దాని కింద నలిగి డ్రైవర్ అక్కడిక్కడే మరణించా డు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడి యాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 4న ఆ జిల్లాలోని ఒక గ్రామంలో ట్రాక్ట ర్లతో స్టంట్ నిర్వహించారు. తేజ్వీ ర్, కలువా ఈ పోటీలో పాల్గొన్నా రు. తాడుతో కట్టిన రెండు ట్రాక్టర్ల ను వెనక్కి లాగేందుకు వారిద్దరూ ప్రయత్నించారు. కాగా, తేజ్వీర్ ట్రాక్టర్‌ను కలువా నడిపే ట్రాక్టర్ చాలా మీటర్ల దూరం విజయవం తంగా వెనక్కి లాగింది. ఇది చూసి అక్కడున్న జనం కేరింతలు కొట్టా రు. అయితే తేజ్వీర్ ట్రాక్టర్ అదు పుతప్పింది. మట్టిరోడ్డు నుంచి పక్క కు దూసుకెళ్లి బోల్తాపడిండి. దానిని నడిపిన తేజ్వీర్ ఆ ట్రాక్టర్ కిందపడి నలిగి మరణించాడు. అక్కడున్న వారు పరుగున అతడి వద్దకు వెళ్లారు. రక్తం మడుగుల్లో తేజ్వీర్ చనిపోవడాన్ని చూశారు.
వీడియో పుల్ వైరల్ . మరో వైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడి యాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యా ప్తు చేశారు. ట్రాక్టర్ స్టంట్‌లో మర ణించిన డ్రైవర్ తేజ్వీర్ మృతదే హానికి గ్రామస్తులు గుట్టుగా అంత్య క్రియలు నిర్వహించినట్లు తెలుసు కున్నారు. అందుకే ఈ సంఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీ స్ అధికారి తెలిపారు. అయినప్ప టికీ వీడియో క్లిప్ ఆధారంగా మరో ట్రాక్టర్ డ్రైవర్ కలువాపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చె ప్పారు. ప్రాణాలు హరించే ఇలాంటి స్టంట్లు చేయవద్దని పోలీసులు సూ చించారు.