Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Driving license: డ్రైవింగ్ లైసెన్స్ మరింత సులభతరం

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది.

జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేసేందుకు రంగం సిద్ధం
డ్రైవింగ్ టెస్ట్ నిర్వహణకై ప్రైవేట్ వ్యక్తులకు కేంద్రం అనుమతి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్(Driving license) పొందే ప్రక్రియను సులభతరం చేసింది. సదరు ఉద్దేశంతో జూన్ 1వ తేది నుంచి కొత్త నిబంధనలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేకుండానే..
దరఖాస్తుదారులు ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయం(RTO) వద్ద డ్రైవింగ్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదని, బదులుగా గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలో నిర్వ హించవచ్చని, దరఖాస్తుదారులు వీటిల్లో ఉత్తీర్ణత సాధిస్తే ధృవీకరణ పత్రాన్ని అందుకుంటారని, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, డ్రైవింగ్ టెస్ట్(Driving test) నిర్వహించేందుకు అనుమ తినిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కేంద్రం సర్టిఫికెట్లు జారీ చేస్తుందని, అయితే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి సర్టిఫికేట్ లేనట్లయితే, అభ్యర్థి ఆర్టిఓ ఆఫీస్ వద్ద డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుం దని వెల్లడిస్తోంది.
అదే సందర్భంలో ఫైన్ లు…
చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కారు నడపితే రూ.2వేల వరకు జరిమానా విధిస్తారు. మైనర్‌లు డ్రైవ్ చేస్తే రూ.25 వేల జరిమా నాతోపాటు, వాహన రిజిస్ట్రేషన్(Registration)సర్టిఫికేట్‌ని రద్దు చేస్తారు. తల్లి దండ్రులపై చర్యలు తీసుకుంటారు. ఇక కాలం చెల్లిన వాహనాలపై ..కాలం చెల్లిన 9,000 ప్రభుత్వ వాహనాలను దశ లవారీగా తొలగించాలని కేంద్రం ఆలో చిస్తోంది. వాహన కాలు ష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలని భావిస్తోంది.
దరఖాస్తు విధానం..
డ్రైవిం గ్ లైసెన్స్ కోసం దరఖాస్తును సమర్పించే విధానం మారదు. అయితే, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన పత్రాలను మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. జూన్ 1 తరువాత తక్కువ పత్రాలు అవసరమవుతాయి. అభ్యర్థులు ఏ వాహనానికైతే లైసెన్స్ తీసు కుంటారో దానిపైనే ధృవపత్రాల భారం తగ్గుతుంది. ఇదిలా ఉండగా లైసెన్స్ ఫీజు లు కూడా క్రమబద్ధీకరించారు.
లెర్నర్ లైసెన్స్ రూ.200,లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ రూ.200,
అంతర్జాతీయ లైసెన్స్ రూ.1,000,
శాశ్వత లైసెన్స్ రూ.200, శాశ్వత లైసెన్స్ పునరుద్ధరణ రూ.200,

డ్రైవింగ్ స్కూళ్లు(Driving Schools) అనుసరిం చాల్సిన విధి విధానాలు.

ప్రైవేట్‌ డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సైతం కేంద్రం పలు నిబంధనలు పెట్టింది. లైట్‌ మోటార్ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఫోర్‌ వీలర్‌(Four wheeler)శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటేనే వారికి ప్రభుత్వం లైసెన్స్‌ జారీ చేస్తుంది.

కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

1. లింక్ క్లిక్ చేయండి
2. మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి
3. “డ్రైవింగ్ లైసెన్స్” మెను నుండి “కొత్త డ్రైవింగ్ లైసెన్స్” పై క్లిక్ చేయండి
4. తదుపరి కొనసాగడానికి “లెర్నింగ్ లైసెన్స్ నంబర్”, “పుట్టిన తేదీ”ని ఎంటర్ చేయండి
5. దరఖాస్తు ఫారమ్ నింపండి
6. కొనసాగించడానికి తదుపరి బటన్‌పై క్లిక్ చేయండి
7. ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఫీజు స్లిప్‌తో షెడ్యూల్ చేసిన తేదీలో RTO కార్యాలయాన్ని సందర్శించండి.

Driving license more easy