Earthquake : ప్రజా దీవెన నేపాల్: హిమాలయ దేశం నేపాల్‌లో భూకంపం సంభ వించింది. రిక్టరు స్కేలుపై భూకం పం తీవ్రత 5.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. గర్ఖాకోట్‌కు మూడు కి.మీ దూరంలో 20కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.
శుక్రవారం రాత్రి 7.52 గంటల స మయంలో ప్రకంపనలు నమోదై నట్లు వెల్లడించింది.దీని తీవ్రతతో ఉత్తర భారతదేశంలోనూ ప్రకంప నలు నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్త రాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు చోట్ల భూమి కంపించింది.
ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యా రు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం సం భవించలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.