Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ED Charge Sheet: ఎన్నికల కోసం వంద కోట్లు

–ఆప్‌ నేతలు వినోద్‌ చౌహాన్‌తో అడిగించారు
–ఈడీ చార్జిషీట్‌లో స్పష్టమైన వెల్లడి

ED Charge Sheet: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఆప్‌ నేతలు పంజాబ్‌, గోవా ఎన్నికల ఖర్చుల కోసం అదనంగా రూ.100 కోట్లను డిమాండ్‌ (demand)చేసినట్లు ఈడీ (ed)ఆరోపించింది. మంగళవారం ఈ మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–37గా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఏ–38గా పేర్కొన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లకు వ్యతిరేకంగా అభియోగాలు మోపింది. వినోద్‌ చౌహాన్‌ (Vinod Chauhan) ద్వారా కేజ్రీవాల్‌(Kejriwal) తమను రూ.100 కోట్ల మేర అదనపు డబ్బులను డిమాండ్‌ చేశారని, పంజాబ్‌, గోవా ఎన్నికల ఖర్చుల కోసం ఆ మేరకు అందజేయాలని సూచించారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌రెడ్డి వాంగ్మూలాన్ని ఉటంకించారు. ఢిల్లీ జల్‌ బోర్డు(డీజేబీ) పోస్టింగుల్లోనూ వినోద్‌ చౌహాన్‌ కీలకంగా వ్యవహరించారని, నేరుగా కేజ్రీవాల్‌ ద్వారా వ్యవహారాలు నెరిపారని పేర్కొన్నట్లు ప్రస్తావించారు. అయితే.. తనకు శరత్‌రెడ్డి ఎవరో తెలియదని కేజ్రీవాల్‌ తన వాంగ్మూలంలో చెప్పారు.

15న హైకోర్టులో (high court) విచారణ కేజ్రీవాల్‌ (Kejriwal) బెయిల్‌ పిటిషన్‌ను సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును (Delhi High Court)ఆశ్రయించిం ది. దీనిపై మంగళవారమే కేజ్రీవా ల్‌కు నోటీసులు ఇచ్చామని, ఆయన స్పందన రాత్రికి వస్తుందని, ఆ తర్వాత కౌంటర్‌ సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్‌ నీనా బన్సాల్‌.. ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ఏఎస్జీ రాజుకు సూచించింది. మంగళవారం అర్ధరాత్రి కేజ్రీవాల్‌ (Kejriwal) లేఖ అందగా.. బుధవారం విచారణ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని ఈడీ కోరింది. కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేసినా.. కోర్టు ఈ నెల 15కు విచారణను లిస్ట్‌ చేసింది.