Encounter : ప్రజా దీవెన, ఛత్తీస్ ఘడ్: ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్ కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బల గాలు తాజాగా ప్రకటించాయి. భద్ర తా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు అల్వాల్ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎదురు కాల్పుల్లో మృతి చెంది నట్లు ప్రకటించాయి. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్ చార్జ్‌గా చంద్రహాస్ పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా మృతి చెందిన మావోయిస్టు ప్రమోద్ అలియాస్ చంద్రహాస్‌పై రూ.20 లక్షల రివార్డు ఉంది.
రంగారెడ్డి జిల్లా యాప్రాల్ జవహర్ నగర్‌కు చెందిన చంద్రహాస్ 1985 నుంచి పరారీలో ఉన్నట్లు సమా చారం. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టు లకు చెందిన భారీ డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. కోబ్రా బెటా లియన్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ జాయింట్ ఆపరేషన్‌లో సుక్మా జిల్లాలోని మెటగూడెం, దులేర్ గ్రామాల మధ్య పేలుడు పదా ర్థాలు, ఆయుధాల తయారీ సా మాగ్రిని వెలికి తీశారు. ఈ ప్రాం తంలో మావోయిస్టుల కదలికలపై ఇంటెలి జెన్స్ ఇన్‌పుట్‌లను అను సరించి భద్రతా బలగాలు ఆపరేష న్ నిర్వహించాయి. స్వాధీనం చేసు కున్న ఆయుధాల్లో ఐఈడీలు, మ ల్టిపుల్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఉన్నట్లు ప్రకటించారు.