Encounter : ప్రజా దీవెన, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియా బంద్ జిల్లాలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళ వారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెం దారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మ హిళా మావోయిస్టులు చనిపోయా రు. దీంతో రెండు రోజులుగా సాగు తున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మరణించి నట్లయింది.
సోమవారం సాయంత్రం గరియా బంద్, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు సంయు క్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్ తారసపడ్డా రు. దీంతో ఇరుపక్షాల మధ్య జరి గిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. అదేవిధంగా సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతిచెంద గా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరే షన్‌లో గరియాబంద్ డీఆర్‌జీ, ఒడి శా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సుమారు వెయ్యి మంది పాల్గొన్నా రు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెం బర్ మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గుడ్డుతో పాటు మావోయి స్టు ముఖ్య నేతలు ఉన్నట్లు సమా చారం. ఆపరేషన్ ఇంకా కొనసాగు తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.