Fire Accident : ప్రజా దీవెన, వాషింగ్టన్ డీసీ: అమె రికాలోని కాలిఫోర్నియా కాలిపోతో oది. ఈసారి లాస్ ఏంజిలస్ కు ఉత్తరాన ఉన్న హ్యూస్లో మంటలు చెలరేగడంతో కార్చిచ్చుకకావికలం చేస్తోంది. దాదాపు 10 వేల ఎకరా ల విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది. ప్రతి మూడు సెకన్లకు ఫుట్ బాల్ మైదా నానికి సమానమైన ప్రాంతం తగల బడిపోతోంది. ఈ అగ్నిప్రమాదం ధాటికి 50 వేల మంది ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. కామరి ల్లో, ఫిల్ మోర్, మూర్ పార్క్, ఆక్సాన్నార్డ్, పీరు, శాంటాపౌలా, సిమివ్యాలీ, వెంచూరా, ఫెర్నాండో వ్యాలీ, శాంటాక్లారిటీ, కాస్టయిక్ లేక్ ప్రాంతాలకు మంటల ముప్పు పొంచి ఉందని దట్టమైన పొగ వ్యా పిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిం చారు.
కాస్టాయిక్ సరస్సు సమీపం లో ఈ మంటలను ఆర్పడానికి 4,0 00 మంది అగ్నిమాపక సిబ్బందిని నియమించా రు. ఇక్కడ గంటకు 48 కి.మీ వేగంతో గాలి వీస్తోంది. అమెరికన్ కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10.45 గంటలకు కాస్టాయిక్ సరస్సు సమీపంలో మంటలు చెలరేగాయి. దానినే కార్చి చ్చుకేంద్రంగా అధికారులు భావిస్తున్నారు.