Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accident : నడిసముద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident : ప్రజా దీవెన, ముంబై: ముంబై అలీ బాగ్ కోస్టల్‌ తీరానికి దాదాపు 6 నుంచి 7 నాటికల్ మైళ్ల దూరం లో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది.రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహు తైం ది. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్టల్‌ గార్డ్స్, నావికా దళం అప్రమత్తమయ్యారు. హుటా హుటీన ప్రమాదం జరిగిన ప్రదేశా నికి చేరుకుని పడవలో ఉన్న 18 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షిం చగలిగారు. ఈ ఘటనలో ఎటువం టి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మునుముందు ఇలాంటి అవాం చనీయ సంఘటనలు జరగకుండా సముద్ర భద్రతా సంస్థలను అప్రమ త్తం చేశారు.ప్రస్తుతం ఇంకా అగ్ని మాపక చర్యలు కొనసాగుతు న్నా యి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘ టనకు సంబంధించిన వీడియో దృ శ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.