Election polling: ప్రశాంతంగా తొలి అంకం
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.
పార్లమెంటు తొలి దశ పోలింగ్ శాతం 62
గత ఎన్నికలతో పోలిస్తే 7 శాతం తగ్గిన ఓటింగ్
మణిపూర్, బెంగాల్ లలో స్వల్ప హింసాత్మక ఘటనలు
రాత్రి 7 గంటల తర్వాత కూడా కొనసాగిన పోలింగ్
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్(polling) ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది.కోట్లాది మం ది తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. 102 సీట్లకు 21 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాం తాలో జరిగిన పోలింగ్ లో రాత్రి 7 గంటల వరకు 82 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2019 ఎన్నిక లు (69.43 శాతం) మొదటి విడతతో పోలిస్తే ఇది తక్కువేనని ఈసీ తెలిపింది.
పోలింగ్ సాయం త్రం ఆరు గంటలకే ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు(voters) బారులు తీరడంతో రాత్రి 7 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. తొలి దశ పార్లమెంటు ఎన్నికల్లో 1600 మందికి పైగా అభ్యర్థులు(candidates) పోటీ పడగా, వారిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్య మంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు. మొదటి విడత పోలింగ్ లో అత్యధి కంగా తమిళనాడు లో39, రాజస్థాన్లో 12, ఉత్తర ప్రదేశ్ 8, మధ్య ప్రదేశ్ 6, ఉత్తరా ఖండ్లో 5 లోక్ సభ స్థానాలలో ఎన్ని కలు జరి గాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ (80), సిక్కిం (32) అసెంబ్లీల కు కూడా శుక్రవారమే పోలింగ్ జరిగింది. ఈవీఎంలపై ఫిర్యాదులు
చిన్న చిన్న వివాదాలు మినహా..
ఛత్తీస్గఢ్, మణిపూర్, బెంగాల్ రాష్ట్రాల్లో చెదు రుమదురు ఘటనలు మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదంటూ ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు వెంటనే కలుగజేసుకుని వాటి స్థానంలో వేరేవి ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇద్దరు వృద్ధులు పోలింగ్ బూత్ లో మరణించారు.
First phase polling calm in parliament elections