Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gautam Adani : అదానీ అమోగమైన ఆలోచన, స్కూల్స్, హాస్పిటల్స్ కు రూ.10 వేల కోట్ల బహుమానం

Gautam Adani : ప్రజా దీవెన, గుజరాత్: దేశం లో అదానీ చరిస్మా అంతా ఇంతా కా దు. అయితే అటువంటి అదానీ అమోఘమైన ప్రజా ప్రయోజనకర ఆలోచన చేశారు. అంతా ముందు గా చెప్పినట్లుగానే దిగ్గజ పారిశ్రా మిక వేత్త గౌతమ్ అదానీతన రెండో కుమారుడు జీత్ అదానీ పెళ్లిని ని రాడంబరంగా నిర్వహించారు. శుక్ర వారం రోజు గుజరాత్ అహ్మదాబా ద్‌లోని అదానీ టౌన్‌షిప్‌లో పలువు రు బంధుమిత్రుల నడుమ చాలా సాదాసీదాగా వివాహం జరిగింది. గుజరాత్ డైమండ్ మర్చంట్ జైమి న్ షా కుమార్తె అయిన దివా జైమి న్ షా మెడలో తాళి కట్టారు జీత్ అదానీ. వివాహం జరిగిన తర్వాత పెళ్లి ఫొటోలు పంచుకుంటూ గౌత మ్ అదానీ స్వయంగా ట్వీట్ చేశా రు. గుజరాతీ, జైన్ సంప్రదాయాల తో కొద్ది మంది బంధుమిత్రుల స మక్షంలో సింపుల్‌గా వివాహం నిర్వహించామని అన్నారు. అం దరు శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించ లేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు.అయితే తన కుమారుడి వివాహం వేళ గౌతమ్ అదానీ తన ఉదారగుణాన్ని మరోసారి చాటుకు న్నారు. కుమారుడికి పెళ్లి గిఫ్ట్‌గా స మాజానికి సేవ చేసేందుకు నడుం బిగించారు. ఏకంగా రూ. 10 వేల కోట్లను విరాళంగా ప్రకటించినట్లు తెలిసింది. దీనిపై పలు ఆంగ్ల మీడి యాల్లో కథనాలు వస్తున్నాయి. దీ నిని వివిధ సామాజిక కారణాల కో సం ఉపయోగించనున్నట్లు గౌతమ్ అదానీని ఉటంకిస్తూ పేర్కొన్నాయి. అయితే అదానీ నేరుగా పెళ్లి సమ యంలో ప్రకటన చేసినట్లు కొన్ని మీ డియాల్లో వచ్చింది.ఇక అదానీకి అ త్యంత సన్నిహిత వ్యక్తి ఈ విష యం చెప్పినట్లు మరి కొన్ని రిపోర్టు లు వెల్లడించాయి. ‘ సామాన్య ప్రజ లకు పలు విధాలుగా ఉపయోగ పడేలా పెద్ద మొత్తంలో విరాళం ఇ వ్వాలని అదానీ నిర్ణయించు కు న్నారని ఆయన అన్నట్లు ఉటంకిం చాయి.

 

పేరు బయటకు చెప్పడా నికి ఇష్టపడని ఆయన మాటల ప్రకారం ఈ విరాళంలో పెద్ద మొత్తం ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యా భివృద్ధి వంటి భారీ మౌలిక సదుపా యాల కార్యక్రమాలకు నిధులు స మకూర్చాలని భావిస్తున్నారు. స మాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వరల్డ్ క్లాస్ హాస్పి టల్స్‌లో వైద్యం, టాప్ స్కూళ్లలో విద్య, నైపుణ్యాలు అందించండపై దృష్టి సారించారు. కాగా ఈ పెళ్లికి ముందు జీత్ అదానీ కూడా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సం గతి తెలిసిందే. ఏటా 500 మంది దివ్యాంగ మహిళలకు వారి పెళ్లి నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 10 లక్ష ల చొప్పున అందించనున్నట్లు ప్రక టించారు. ఈ విషయాన్ని వివరి స్తూ స్వయంగా అదానీనే ట్వీట్ చేశారు.మహా కుంభమేళాకు గత నెలలో వెళ్లిన సమయంలోనే ఫి బ్రవరి 7న జీత్ అదానీ- దివా పెళ్లి జరుగుతుందని సింపుల్‌గా నిర్వ హిస్తామని చెప్పారు. సెలబ్రిటీల్ని ఆహ్వానించి అంగరంగ వైభవంగా చేస్తారన్న ఊహాగానాలకు దీనితో తెరపడింది. చెప్పినట్లుగానే నిరా డంబరంగానే వివాహం జరిపించిన ట్లు తెలుస్తోంది.