Union Minister Suresh Gopi: మోదీ మంత్రివర్గంలో స్థానం పూర్వజన్మ సుకృతం
ప్రధాని మోదీ మంత్రివర్గంలో స్థానం దక్క డం నా పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి పేర్కొన్నారు.
నేను వైదొలుగుతున్నట్లు ప్రచారం శుద్ధ అబద్ధం
సినీ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంత్రివర్గంలో స్థానం దక్క డం నా పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి (Union Minister Suresh Gopi)పేర్కొన్నారు. కేంద్రం మంత్రివర్గం నుంచి నేను వైదొలుగు తున్నట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. మోదీ క్యాబినెట్(Modi’s cabinet)లో కొనసాగడం అదృష్టం అని, తాను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు.
కేరళలోని త్రిసూర్ నుంచి గెలిచిన సురేశ్ గోపీ ఆదివారం రాత్రి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశా రు. అయితే కాసేపటికే నేను సిని మాలు చేయాలనుకుంటున్నా. ఈ బాధ్యతల నుంచి త్వరలోనే విము క్తి చేస్తారని భావిస్తున్నా అని వ్యా ఖ్యానించారు. ఇవి కాస్త చర్చనీ యాంశం కావడంతో ఆయన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. కేరళ ప్రతి నిధిగా మోదీ క్యాబినెట్‌లో(Modi’s cabinet) చోటుద క్కడం గర్వకారణమని, కొన్ని మీడి యా సంస్థలు తాను రాజీనామా చేస్తున్నట్లు తప్పుడు కథనాలు రాస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Good luck staying in Modi’s cabinet