Husband Spotdied : ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ లో ఉత్సాహంగా వివాహ వార్షికోత్సవం లో సంతోషంగా ఉన్న కుటుంబానికి అనుకోకుండా షాక్ తగిలింది. వివాహ వేడుకలో స్టేజ్ పై భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తోన్న భర్త కుప్పకూలి హఠాన్మరణం చెం దాడు.
ఈ తీవ్ర విషాద సంఘటన ఉత్తరప్ర దేశ్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 25వ వివాహ వార్షికోత్సవ కా ర్యక్రమంలో భార్య ముందే అకస్మా త్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బరేలీలో చోటు చేసుకుంది.
షూ వ్యాపారి అయిన 50 ఏళ్ల వ సీం సర్వత్ తన 25వ వివాహ వార్షి కోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పా ర్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా అతిథులతో ఎంతో సరదాగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో స్టేజ్‌పై తన భార్య ఫ రాతో కలిసి డ్యాన్స్ చేశాడు. అ యితే, ఆ సమయంలో వసీం స్టే జ్‌పైనే కుప్పకూలి కిందపడిపో యా డు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ని ర్ధారించారు. గుండెపోటుతో ప్రా ణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు కాస్తా విషాదాంతమయ్యాయి. కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Husband spotdead in uttar pradesh anniversary function pic.twitter.com/vPtQveBJoL
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) April 4, 2025