Lok sabha election voting: లోక్ సభ ఓటింగ్ లో భారత్ చరిత్ర సృష్టించింది
దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ద్వారా ప్రపంచ రికా ర్డు సృష్టించడం జరిగిందని భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డు
జీ7 సభ్య దేశాలన్నింటి జనాభా కన్నా 1.5 రేట్లు అధికం
ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళ లు ఓటు వేశారు
లోక్‌సభ ఎన్నికల సమయంలో రూ. పది వేల కోట్ల నగదు సీజ్
మీడియా సమావేశంలో భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల్లో(Parliament elections) 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ద్వారా ప్రపంచ రికా ర్డు సృష్టించడం జరిగిందని భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ (Chief Election Commissioner of India Rajeev Kumar)పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్ని కల్లో మొత్తం ఓటింగ్ జీ7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభాల న్నింటికంటే 1.5 రేట్లు అధికం అని వివరించారు. ప్రపంచంలోనే అత్య ధికంగా మనదేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్నా రు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని చెప్పారు. అయితే 2019లో 540 చోట్ల రీపో లింగ్ జరిగిందనిగుర్తు చేశారు. గత నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha elections) జ మ్మూకశ్మీర్‌లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్లు సీఈసీ తెలి పారు. హింస లేకుండా జనరల్ ఎల క్షన్స్ జరగడం ఇదే మొదటిసారని, దీని వెనక రెండేళ్ల ప్రణాళిక ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా లోక్‌స భ ఎన్నికల్లో సుమారు 68 వేల మానిటరింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించినట్లు సీఈసీ వెల్లడిం చారు. 2024 ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1,692 విమాన సర్వీసులను ఉప యోగించినట్లు చెప్పారు. అలాగే ఎన్నికల కమీషనర్లను ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ సోషల్ మీడి యాలో కామెంట్ చేయడం పట్ల సీఈసీ స్పందించారు. తాము ఇక్కడే ఉన్నామని, ఎక్కడికీ పారిపోలేదని ఆయన కౌంటర్ ఇచ్చారు.లోక్‌సభ ఎన్నికల (Lok sabha elections)వేళ పది వేల కోట్ల నగదును సీజ్ చేసి నట్లు వెల్లడించారు. డ్రగ్స్, భారీ మొత్తంలో మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు 495 ఫిర్యాదులు రాగా, వాటిలో 90 శాతం తక్షణమే పరిష్కరించి నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. టాప్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేం దుకు అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలియజేశారు. డీప్ ఫేక్, ఏఐ ఆధారిత కాంటెంట్ ను చాలా వరకు నియంత్రించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
India created history in Lok Sabha voting