పాక్ పై భారత్ ఘన విజయం
— కోహ్లీ అజేయ సెంచరీతో సెమిస్ లో భారత్
Indiawin: ప్రజా దీవెన షార్జా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దాయాది చిరకాల ప్రత్య ర్థి పాకిస్థాన్ తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో వీక్షించే ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో విజ యం సాధించి సెమీస్ బెర్త్ ఖా యం చేసుకుంది.
ఇదిలా ఉంటే ఈ మ్యా చ్‌లో విరాట్ కోహ్లీ పునరాగమనం అభిమా నులను ఆకట్టుకుంది. సుదీర్ఘకాలం పాటు పేలవ ఫామ్‌తో సతమ తమవుతున్న కోహ్లి ఈ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో 100 పరు గులను శతకొట్టాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ కాగా, అంత ర్జాతీయంగా 82వ సెంచరీ. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (20), ఓపె నర్ శుభమన్ గిల్ (46), శ్రేయస్ అయ్యార్ (56 తొలి ఛాంపియన్ షిప్ ఫిఫ్టీ) కీలక ఇన్నింగ్ ఆడారు.
ఈ టోర్నీలో వరుస విజయాలు అందుకున్న రోహిత్ సేనl పాయిం ట్స్ టేబుల్లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానికి చేరుకుంది. దీంతో భార త జట్టు సెమీస్ బెర్త్ దాదాపు ఖా యం చేసుకుంది. ఏది ఏమైనా మ్యాచ్ చివరి సమయంలో విరాట్ కోహ్లీ ప్రదర్శించిన ఆట తీరు అబ్బు రపరిచింది.